పుట:Delhi-Darbaru.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

306

మైసూరు రాజ్యము.


చెను. ఈ రాష్ట్రకూటుల కే రాట్టులనియు వీరి రాజ్యమునకే రాట్ట వాడి యనియుఁ బేళ్లుగలవు. వీరి రాజధాని మొదట నాసిక జిల్లాలోని మయూర ఖండముగ నుండెడిది గాని తొమ్మిదవ శతాబ్దమున నయ్యది నైజాము ఇలాకాలోని మాన్య ఖేటము (ప్రస్తుతపు మాల్ ఫేడు) నకు మారువఁ బడెను.

ఎనిమిదన శతాబ్దమునంతమున ధృవుఁడు లేక ధారవర్షుఁడు అనంబడు ఈవంశ పురాజు పల్లవరాజునోడించి యతఁడుదనకుఁ గప్ప ముగట్టు నల్లొనర్చెను. గంగుల రాజును గూడ చెఱపట్టెను. కొని యీతనికిఁ దరువాతి వాడగు గోవిందుడు గంగరాజు నకు స్వాతంత్ర్య మిచ్చుట ఇదివటి కే వ్రాయఁబడియెను. తొమ్మిదవ శతాబ్దములో రాష్ట్రకూట రాజ్య మేలిన అమోఘ వర్షుఁడను నృపతుంగ మహీపాలుఁడు బహుకాలము రాజ్యము చేసి కన్నడ భాషయం దభిరుచికలవాఁడై గ్రంథములు వ్రాసి కర్నాటక భాషయందును కర్నాటక జనులయందును దనకు గల యాదరణమును జూపి పరలోకమున కేగెను. అతనికి దరువాతి వాఁడగు అకాలవర్షుఁడు తూర్పు చాళుక్యులతో ఎడ లేని విగ్రహము జరిపెను. కాని వీరు పదియవ శతాబ్దమున చోళులకులోఁబడి పోవుటవలన చోళులకును రాష్ట్రకూటుల కును విగ్రహము ప్రారంభమయ్యెను. అప్పటికి రాష్ట్రకూటు లకు గంగులసాయ ముండినందున చోళులోడింపఁబడి వారి రాజు చంపఁబడెను. తరువాత రాష్ట్రకూటులకును గంగులకును