పుట:Delhi-Darbaru.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

308

మైసూరు రాజ్యము.


1076 వ సంవత్సరమున ఆఱవ విక్రమాదిత్యుఁడు సింహాసనమునకు. వచ్చెను. ఇతఁడు మహాపరాక్రమశాలి. చాళుక్య విక్రమార్కశక మితని వలనఁ బుట్టిన దే. బిల ణుని విక్రమాంక దేవచరితము[1]నకు కథానాయకుఁ డితఁడే. ఈతని విజయముల వలన పశ్చిమ చాళుక్య రాజ్యము మహా న్నత్య మందెను. ఈతఁడు రాజకీయ శాంతి కొఱకు ఇతరవం శముల వారితో విరివిగ సంబంధ బాంధన్యములు చేసికొని. నట్లు గాననచ్చుచున్నది. విజ్ఞానేశ్వరుఁడితని కాలము నుదె యుండి మన హిందూ ధర్మశాస్త్రమునకు ముఖ్యా ధారము లలో నొక్కటగు మితాక్ష రన్యాయమును వ్రాసెను. ఇతఁడు “భువిపై కల్యాణముపోలు నగరము ఇదివఱకుండినదిగాదు. ఇప్పుడు లేదు. ఇక నెప్పటికిని ఉడఁజాలదు. విక్రమార్కునినంటి నృపాలుని గుణించి వినినదిగాని అట్టివానిని గనినది గాని లేదు” అని వ్రాసియున్నాము. ఈవిక్రమార్కుని రాజ్యాంతమున నే ముందుచాళుక్యశక్తి నిరూలకులుగా నున్న "హోయిసణులుగను పట్టిరిగాని ఇతని దండనాయకునిచే వారుపరాజితులయిరి. అయిన కాల ప్రవాహము నిలుచునది గాదు. విక్రమార్కుని యనంతరము చాళుక్య ప్రతాపము చల్లఁబడఁ జొచ్చెను, 1157 వ సంవత్సర మున చాళుక్య సైన్యాధిపతిగను-డి రానురాను బలవంతుఁడయి ........................................................................................

1

  1. ఇది తిరుపతి వెంక టేశ్వర కవులచే రసవత్తరముగ తెలుగులోనికి, భాషాంతరము చేయఁబడి సరస్వతి పత్రిక యందు ముద్రింపఁబడిది.