పుట:Delhi-Darbaru.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

246

బరో డారాష్ట్రము


.

నము ఆంగ్లేయులకు బాకీపడియుండిన మొత్తము నంతయును 1812 న సంవత్సరము " లోపలఁ దీర్చి వేసియుండెను. కావున నాంగ్లేయులు బరోడా, రాజ్యమునందు విశేషము జోక్యము పుచ్చుకొను. 'ఆచారము మాని వేయ వలయునను ఉద్దేశము గల వారయిరి.

ఇదివఱకే వ్రాయఁబడిన తెఱంగున 'కన్ హోజి మజులఁ దిరుగఁబడి యల్లరులకుఁ బూనిసందునను ముందువర్ణితము గాఁబోవు ఇతర కష్టములు చూపట్టినందునను పై యుద్దే శము ఆంగ్లేయ ప్రభుత్వము వారికి నెఱ వేరినది గాదు. కవ్ హోజి మద్రాసునకుఁ బ్రవాసమునకుఁ బంపఁ బడకమున్నె పీష్వా గాయిక వాడు దనకు బాకీదారుఁడని గొప్ప లెక్కలను వేయ నారంభించెను. అహమ్మదాబాదు విషయమున నాతఁ డితని కిచ్చిన కౌలునకుఁ గూడ నాయువు నిండనుండె. వీరిరువురకును 'మైత్రియు సన్న గిలి పోవుచుండె. ' కావున నహమ్మదా బాదు మఱల గాయక వాడున కియ్యఁబడదనియు నతఁడు దీర్చ లేనం తటి యప్పుపద్దును పీష్వా : ప్రదర్శింపుననియును ఆరంగమున నుండిన . వారందఱకును గోచరముగాఁ జొచ్చెను. ఇంతీయ గాక పీష్వా చేసిన సంధివలనఁ దాను గాయిక వాడు పై నధికా రమును వదలుకోనుటకుఁ బశ్చాత్తాపము ' నంది మఱల "నేవిధ ముగ నైన దనయధికారమునకు మార్గ మేర్పఱచుకొనఁ బ్రయ త్నింపఁ గడఁగెను. ఇట బరోడాయందు దివాను పదమునుండి