పుట:Delhi-Darbaru.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ నంద రావు.

245


యములు జరుగకుండ నేర్పాటులొనర్చి 'ములుక్ గిరి' ని నిశ్చ యమయిన కప్పములలోనికి మార్చి వేసెను. ఇట్లు వరుంబడి విషయమున ' పరిశ్రమచేసి మహాకష్ట ముతో సిబ్బందిని ' దనకు సాధ్య మయినంత తగ్గించి వేసెను. రాజ్యాంగముల నొక్కొక్క దానికిని సంవత్సరమున కింత కంటే నెక్కుడు వ్యయము కాకూడదని నిర్ధారణము చేసి ఆ మొత్తమును మించకుండ - నేర్పఱచెను. మహా రాజుగారి - స్వంత వ్యయము విషయమునఁ గూడ హద్దులనునిచెను.

ఈ కార్యములనెల్ల బహు సమర్థతతో నెరవేర్చుచు రెసిడెంటునకు ముఖ్యసాహాయ్యుం డయియుండిన బాబాజీ అప్పాజీ 1810న సంనత్సరము 'నవంబరు నెలలోఁ జనిపోయెను. అతనికుమారుఁడు విఠలరావు భావు ఆతని స్థానమున ‘ ఖాస్గి పాలా' (కార్యనిర్వాహకుఁడు) ఆయెను. 1813 లో నితఁడు కా థియవాడునకు సర్ సూబాగా[1] వెడలిన పిదప సుప్రసిద్ధుఁడగు గంగాధర శాస్త్రి దివాను పట్టమునకు వచ్చెను. 1810 లోనే వాకరు స్వదేశమునకు వెడలిపోయి యుండెను. అతని పదమున కాప్టెన్ (తరువాత 'మేజరు జన రల్) సర్ జేమ్సు కార్నకు నియమింపఁ బడియుండెను. ఈయి రువురు రెసిడెంటుల యధికారముక్రింద బాబాజీ, విఠలరావు, గంగాధర శాస్త్రి వీరల సామర్థ్యము వలన బరోడా సంస్థా


1.

  1. ప్రతినిధి