పుట:Delhi-Darbaru.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆనందరావు

247


యవమానముతో దొలంగింపంబడి యుండిన శీతారాము దన విరోధులకుఁ బ్రతీకారము సేయ దారి యఱయుచుండెను: ఫతేసింగు గంగాధరశాస్త్రియందు నమ్మకమును ఆంగ్లేయ ప్రభు త్వము నెడ సంపూర్ణ విశ్వాసమును గలవాఁడయి . సమర్థతతో గార్యములు సాధింపనుం డెనుగాని ఆనంద రావు 'మిక్కిలి యస మర్థుఁ డగుటంబట్టియు నాంగ్లేయులు సంపూర్ణముగ సాయము సేయకపోవుట బట్టియు నతఁడు బలన త్తరమగు విరోధ శక్తుల నణంచుటలో మిక్కిలి కష్టపడవలసి వచ్చెను. అయినను శీతా, రాము పీష్వా యనుగ్రహమును బొంది మఱల స్వస్థానమును జేర వలయునను దలంపుతో రాష్ట్ర ద్రోహియయి మెలఁగుచుండుటఁ జక్క గ గుర్తించి యితఁడు వానినిబట్టి చెరసాల యందుంచెను. కొంతవాదము జరిగిన తరువాత గంగాధర శాస్త్రి . గాయికవాడు పరమున పీష్వాతో సంభాషించి వచ్చుటకు పునహాకు వెడలిపోయెను. అచ్చట పీష్వా బాజీరావు ఈతనితో మంచి మాటలాడి మాయోపాయములు పన్ని తన మరదలి సీతని కుమారునకు వివాహమున నిప్పిం చెదనని నుడివి పలు తెఱం గులనమ్మించి తుట్టతుదకు ఒక నాఁటిరాత్రి నిరాయుధుఁడును సాహాయ్య శూన్యుఁడును నయియుండ ట్రింబక్త్జి మూలమున హంతకుల నేమించి ఈతనిని జంపించెను. గంగాధర శాస్త్రులు పునహాకు నాంగ్లేయుల పూచీపయి పోయియుండెను. 'కాని ఆ గ్లేయు లాతని మరణమునకుఁ దగిన ' పూర్ణ ప్రతీకారము