పుట:Delhi-Darbaru.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

242

బరోడారాష్ట్ర ము.



గ్గుఁడై నందున సంస్కారములఁ దోడ్పడుటకు . బదులు కుట్ర లాలోచించి స్వామి ద్రోహము సేయఁ బూనుకొనెను. అందు నలన .నతఁడు తుట్టతుదకు (1808) అవమానము చెందెను. అతఁడింకను దివానుగ నుండునపుడు దన పినతండ్రియగు బాబాజీ అప్పాజిని , దనకు సాహాయ్యము పిలుపించుకొని యుండెను. ఇంతేకాక శీతారాముయొక్క శక్తిని దగ్గించుటకయి ఆనంద రావు తమ్ముడగు ఫతేసింగు. బాబాజీ తోఁ గూడ రాజ ప్రతి నిధగ నేమింపఁబడి యుండెను. ఇట్లు బరోడా సంస్థానము రెసి డెంటుగారి బోధలననుసరించి దివాను, రాజప్రతినిధి మఱి ఇతరమంత్రులు మున్నగువారలతోఁ ' జేరిన సభవలన పరిపా లింపఁబడఁ జొచ్చెను. ఈ సభకే కమిష నని పేరు. దీని కల యుటలకే దర్బారులని నామము. మొదటి దర్బారు 1807 న సంవత్సరము : ఫిబ్రవరి నెల 8 వ తేది నాఁడు జరిగెను. నాటి నుండి బాబాజి ముఖ్య కార్యనిర్వాహకుఁడయి రాజ్యాంగమును నడపెను. ఇట నక్కాలమునందు ఆ సంస్థానమున రాజ్య వ్యవస్థ యెట్లుండినదియు వాకరు వలన నయ్య దెట్లుపయో గించు కొనఁబడినదియును సంక్షేపముగ వర్ణించవలసియున్నది.

అప్పులు విశేషముగ రాజ్యాంగముపయి నిలచియుండె నని పైనివ్రాయఁబడియెను. ఆదాయమార్గములలో ముఖ్యతమ మగునది యే రాష్ట్రమునందును భూమి పన్నే గదా! దానిని వసూలు చేయు పద్ధతులు బరోడాయందు పూర్వ రాజ్యము