పుట:Delhi-Darbaru.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

218

బ రో డా రాష్ట్ర ము.


దానితో నతఁడు అభయసింగును రూపుమాప గడంగెను కాని మాయోపాయమున వీఁ డె యతనినిజంపిం చెను. అయిన నాహం తకునకుఁ దగినశత్రువు గాయిక వాడులలో లేక పోలేదు.

దామాజి II (1732-1768).

పీలాజికునూరుఁడు అగు దామాజి II తండ్రి ప్రయత్న ములను సార్థకపఱచి గొప్ప రాజ్యమును సంపాదింప నుండెను. .

  • పీలాజి' మరణముతో మహారాష్ట్రులు సరియగు నాయకుఁడు

లేమిచే చెల్లా చెదరయి యుందురను నమ్మకముతో నభయసింగు బరోడా నగరము పై దండెత్తి ఆపట్టణమును కోటను బట్టుకోని యెను.దామాజి దాయికిఁ దరలిపోయి అటనుండి అహమ్మ దాబాదుమార్గమున నే త్తిపోయి ప్రతీకార మొనర్ప సిద్ధపడ మొదలిడెను. “ పీలాజి' కిఁ బూర్వ స్నేహితుఁడగు పాడ్రాగ్రామపు దేశాయి బిల్లు లనుకోలులను మహమ్మదీయుల మీఁదికిఁ బురి కొల్పి యల్లరులు జరిగించెను. గాయిక వాడు కుటుంబపు బలము లు 'సోనమడు' నందు వచ్చిచేరెను. పీలాజితో వీరస్వర్గమందిన సేనాపతి భార్య 'ఉమాబాయి' గాయిక వాడులకు సాహాయ్య ముచేయ , నే తెంచెను. ఇట్టి సన్నాహములతోఁ బనికిఁ బూనిన 'దామాజి' కి విజయమగుట కేమి సందియము ? అహమదా బాదునందుఁ గొంచెము గెలుపు గలిగిన దే గాక బరోడా మఱల నతని వశమయి పోయెను. నాఁటినుండి నేటివఱకా నగరము గాయిక వాడుల ఆధీనమందే యుండియున్నది. బరోడా వచ్చి