పుట:Delhi-Darbaru.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీలాజీ

217


నంగీకరింపఁ బడక పోవుటచే నతని స్థానమునఁ బ్రతినిధిగ 1730లో జోధపురమునకు 'రాజుగనుండిన అభయసింగు నేమింప బడెను.

ఈ అభయసింగుతోఁగూడ పీష్వా ' పీలాజి' కవ్యతి రేక ముగ మైత్రి చేసికొని ఏలాగైనను ఇతనిని బరోజు నుండి వెడలఁ గొట్ట వలయునను పట్టుపట్టెను. 1781 వ సంవత్సరమున నీ ప్రయత్నమున బయలు దేరుటతో నే నైజాముల్ , ముల్కు తన పైకి దాడి వెడలనున్నాఁడను నార్త వచ్చుటవలన పీష్వా మరలి పోయెను. అట్లు పోవుచుండ మార్గమున. నతని సైన్యములకు గాయిక వాడ్ సేనాపతుల దండు లెదురుపడెను. యుద్ధము ప్రారంభమాయెను. అందు సేనాపతి మడిసె. గాయక వాడునకు గాయము తగిలె. వారి సై న్యములు అపజయమందెను. ఇదియే ప్రసిద్ధి చెందిన భీలా పుర యుద్ధము.

ఈ యుద్ధమునకు యుద్దమునకు దరువాత. “ పీలాజి' మఱల 'సోన ఘడు బరువెత్తిపోయెను. కాని పీష్వా కాని పీష్వా తక్కిన మహారాష్ట్ర నాయకులను నశింపఁ జేయు నుద్దేశము లేని వాఁడగుట మడసిన సేనాపతి కుమారుఁడగు జస్వంత రావు నకు సేనాపతిత్వమును * పీలాజి ' కి ' ముతాలికత్వము'ను అనఁగా ప్రత్యధి కారమును (Deputy) ఇచ్చి ' పీలాజి' కి సేనా ఖాస్ "ఖేల్ " అనుబిరుదము నెసం గెను. “ము తొలికుఁ , డైనం దున ' పీలాజికి' సేనాపతికిఁ గల సర్వాధికారమును దొర కెను,