పుట:Delhi-Darbaru.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

216

బరోడా రాష్ట్ర ము.



నములో నుండిన ' ధాబాయి' యను గ్రామమునకు దరలివచ్చి దానినే రాజధానిగ నేర్పఱచుకొనెను.

తరువాతఁ గొంతకాలమువఱకును మపారా ష్ట్రుల కపజయముపయి నపజయము సంభవించెను. “పీలాజి' మొదట కాంబే'కును - పిదప సూరతు నకును బారిపో వలసిన వాడయ్యెను. కాని మహమ్మదీయ ప్రతినిధియగు సర్బులందుభానునకు ఢిల్లీ నుండి సాయము రానందున మఱల మహా రాష్ట్రులు విజృంభించుట కనుకూల మయ్యెను. మా హీనదికి దక్షిణ తీరముననుండు జిల్లాలలోని ,పన్నులలో నొక్క భాగమునకు ' పీలాజి కి అర్హతగలదని అతఁడొప్పుకొనియెను. కాని మహారాష్ట్రులలోనే పీష్వాకును సేనాపతికిని విరో ధము ప్రారంభమయి యుండెను. కావున పీష్వాపరముగ “పొ న్వారు' ( పీలాజిని' ఎదురింప నియమింపఁబడియెను. ఇంతేకాక పీష్వా బాజీరావునకును సర్బులందుఖానునకును మైత్రి జరుగుట వలన పీష్వా సర్బులందుఖానునకు ' పీలాజి ' నణఁచుటలో దోడ్పడినచో నతనికి చౌతుపన్నును దానితో గూడ సర్ - దేష్ - ముఖిపన్నును (అనఁగా పన్ను నందు మఱియొక , పదియవ వంతును) అందునట్లు సంధిజరిగెను. కాని ‘ పీలాజి' కదృష్ట సమ యముగ నుండుట వలన నతఁడు 'దాభాయి' ' బరోడా' పట్టణ ములను స్వాధీనము చేసి కొనెను. దీనికిఁ దోడుగ సర్బులందు ఖాను పీష్వాతోఁ జేసికొనిన సంధి ఢిల్లీ బాదుషాహగారి వలన