పుట:Delhi-Darbaru.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నైజామున కపనమ్మకము.

187


గుటవలనఁ బరమాత్ముడతని కేమియు నపాయము గలుగ కుండు నట్లు పన్ని వేసెను. హత్య కుపక్రమించిన దుర్మార్గుని ఉరిదీయ వలసినదని నైజాముత్తరు విచ్చెను. ఆయుత్తరువును మరలించి వానిని ద్వీపాంతరవాస శిక్షతో వదలి పెట్టించవ లెననీ సర్ సాలా రెంతగా ప్రయత్నించెననిన అతని కరుణార్ద్ర హృదయ ము వెల్లడి కాగలదు!

నైజామున కపనమ్మకము.

సర్ సాలారు. అనేక విషయముల ఆంగ్లేయులసాయమును 'పొందినది నిజమే. అయిన నతడట్టి సాహాయ్యమును పొందిన దెల్లయు నైజాము నకు లాభమగు కార్యముల నొనర్చుట కే కాని మఱి యేటికినిగాదు. మాతృభూమియగు హైదరాబాదుసంస్థా నము పయి నతనికిఁగల అభిమానము ఇంకను విస్పష్టముగ ముందు దెలియఁగలదు. దాని మూలముననే అతని అద్వితీయ ధర్మబుద్ధి వెలువడఁగలదు. కాని మహాకార్యముల సాధించు వారి కనేకవిధములగు నాటంకములు రాకమానవు. ఈ విధికి. సర్ సాలారుజంగును దలయొగ్గవలసిన వాఁడె గదా, అతనిపై నైజామునకు విరోధభావ మెక్కుడగుచువచ్చి 1867వ సంవత్సర మున నతఁడు రాజీనామానియ్య సన్నద్ధుఁడు గావలసివచ్చెను.

టెంపిలు వాక్యములు.

ఆసంవత్సరము ఏప్రిల్ మాసమున హైదరాబాదునకు