పుట:Delhi-Darbaru.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

.188

హైదరాబాదుసంస్థానము.


'రెసిడెంటుగాపోయిన సర్ రిచ్చర్డు టెంపిలు నైజాము సర్ సాలా రుజంగు నిడిన యవస్థలనిట్లు వర్ణించు చున్నాఁడు.

‘‘నైజామువలన నాతఁడు (సర్ సాలారు) 'బానిస స్థితి యం దుంచఁబడి యుండెను. అతఁడు తన ఇల్లు విడువ గూడని ఖయిదీయన వచ్చును. తనయజమానుని ఆజ్ఞ లేని దతఁడు దన యావరణమును విడిచి చన లేకుం డెను. నగరమునకు వెలుపల నుండు తన వసంతభవనమున విందు జరుపవ లెననినను, ఆంగ్లే య సైనికుల బారుదీర్చి పరీక్షింపవలెననినను, 'రేసి డెంటుతో 'మాటలాడవ లెననినను, అతఁడు ఉత్తరవు పొందనలసినదే. ఆఉత్తరవు పొందుట నామకార్థమని యనుకొనబోకుఁడి. ఉత్త రవు దొరకినను దొరకును, లేకున్న లేదు. ఒక వేళ ఉత్తరువియ్యఁ బడినను నై జాముగారి మనస్సంతోషముతో నియ్యఁబడుచుండు ట లేదు. నాకు అతనితో (సాలారుజంగుతో) వి శేషము పని యుండెడిది. ఆపని దీర్చుకొనుట మిక్కిలి కష్టముగ నుండెడిది. “అతనిని పలుమారు చూతమాయనిన దానివలన నైజామున కీర్ష్యయెడమును. లేక కాగితములుపంపి' పనిచేసికొందమా యనిన నదియును నైజామునకుఁ దెలుపఁబడుచుండుటవలన ' ఆక్షేపణీయమే. ఇట్లుండియు సాలార్ జంగు దీనినంతయును గష్టముగ గణించిన వాఁడు గాఁడు. దేశము నందలి అతని సోదరు లెల్లరుంబలె నతఁడును తనయజమానుని గౌరవించు చుండెను. నైజాముసన్నిధి కతఁడు పలుమారు విడువఁబడుచుండ లేదు.