పుట:Delhi-Darbaru.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

179,

గ్రిబ్బిల్ అభిప్రాయములు.


లారుజంగుయొక్కయు స్నేహమును ప్రేమను భ క్తిని అంగీకరిం చుచు వారికి గవర్న రుజనరలుగారు బహుమతులనంపిరి. ఆప్పు డు చేతికిచ్చిన బహుమతుల వెల ఇంచుమించుగ లక్ష రూపా యీలు. అదివఱకు నైజాము ఆంగ్లేయులకప్పుపడిన ఏబదిలక్షులు రూపాయలును రద్దుచేయఁబడియెను. ఇంతియేగాక నైజాము చే నా గ్లేయుల కదివఱకియ్యఁబడియుండిన రాయచూరు నల్దుర్గము ధారసియో జిల్లాలు తిరిగి అతనికి మరల్చఁబడెను. తిరుగుబాటు చేసిన వారలలో నెక్కఁడగు పోలాపూరు రాజుగారి సంస్థానము గూడ నైజామున కప్పగింపఁబడెను. నైజామునకు నైట్ గ్రాం డుకమాండర్ ఆఫ్ దిస్టారు ఆఫ్ ఇండియా' యను బిరుదొసంగఁ బడెను. సర్ సాలారుజంగునకును ఉచితరీతిసి బహుమానము లర్పింపఁబడెను.[1]

గ్రిబ్బిల్ అభిప్రాయములు.

ఈ బహుమానములను గుఱించి జె. డి. బి. గ్రిబ్బిల్ అను చరిత్రకారుఁ డీ క్రింది విధమున వ్రాయుచున్నాఁడు: ---

"1858 న సంవత్సరమున మనకు దత్తమయిన రాయచూరు మండలమును దిరిగియిచ్చితిమి. ఇదిమన యౌ దార్యమువలన నై నదనుట సమంజసముగా నుండదు. నై జాము సైన్యమునకగు వ్యయమున కై ఆప్రదేశము ఇయ్యఁబడి .............................................................................................

1.

  1. ఈబహుమాన విషయములన్నియు 1860 వ సంవత్సరపు సంధి యందుఁ జేర్పఁబడినవి.