పుట:Delhi-Darbaru.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహావిష్ణన విచ్ఛేదనము.

177


బ్రయత్నించుటలో నొక్కఁడు కాల్చి వేయఁబడెను. రెండవ వాడు ద్వీపాంతర వాసశిక్షనం దెను. ఇప్పగిది. బహుజాగ రూకతతో సర్ సాలార్ జంగ్ హైదరాబాదునందు తిరుగుబా టులు లేకుండునట్లు కాచి విప్ల వదుఃఖము విశేషము దటస్థిం పకుండున ట్లోనర్చెను. నైజాముగారి ముఖ్యమంత్రి నైజాము నకును ఆంగ్లేయులకును గల మైత్రిని దలంచి ఇంత పరిశ్రమ చేయుచుండినను నైజామును మాత్రము ఆంగ్లేయులు బహు జాగరూకులయి కనిపట్టియుండిరి,

విప్ల వపక్షమున నుండినట్లెన్నఁబడిన ఒక ఖైదీ మైసూరు నందు కమిషనరు గారి ఎదుట వాంగ్మూలములోఁ గొన్ని సంగ తులు నుడి వెనఁట. వాని మాటలలో గొన్నింటిని ఆంగ్లేయ ప్రభు త్వము వారు హైదరాబాదు రెసిడెంటునకు వ్రాసి పంపి నైజా మునకు తిరుగుబాటునకగు నూహలు లేవాయని పరిశీలింపమనిరి. దానిపై రెసిడెంటు తాను నైజామేమాత్రమును సందేహ పడుటకు వీలు లేనంతటి సూక్ష్మ మగు విధమున నతని చర్యలను జక్కఁగ పరిశోధింపించె ననియు, అతనియొద్దకు విప్లవపక్షులగు వారు వచ్చి తమ యుదంతము నంతయును జెప్పుకొనిరనియు, అద్దానినంతయును విని అతఁడు ఆంగ్లేయ ప్రభుత్వము వారికి వి రోధమగు నేకార్యమునందును జొరనియ్యకొన లేదనియుఁ బ్ర త్ళు త్తరము వ్రాసెను..[1] ...............................................................................

I.

  1. Frazer—the Nizam, Our Faithful Ally.