పుట:Delhi-Darbaru.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

హైదరాబాదు సంస్థానము.


సైన్య సమ స్య

ఆంగ్లేయులకు నైజామప్పువడుటకు ముఖ్య కారణము నైజాము సైన్య మేయనుట మాచదువరు లిదివఱ కే గ్రహించి యుందురు. సాహాయ్య సైన్యమను నదొక్కటేర్పడుటయు అది మొదట మొదట నైజామునకు వలసినప్పుడు పంపఁబడు చుండుటయు దానికగున్యయమునకు గాను ప్రారంభమున ఉత్తర సర్కారుల గుత్తలోనుండి కొంత భాగము చెల్లువడు చుండుటయు తరువాత ఉత్తరసర్కారులును దత్త మండ లములును 1[1] ఆంగ్లేయులకు సంపూర్ణముగ నియ్యఁబడుటయు మున్నగు విషయము లెల్లయు నిదివఱకే వ్రాయఁబడియున్నవి. ఆ నైజాము సైన్యమునకును ఈసాహాయ్య సైన్యమునకును సంబంధము లేదనుట ముఖ్యముగ జ్ఞాపక ముంచుకొనవలెను. సాహాయ్య, సైన్యము మొదటినుండియు సర్వమా గ్లేయుల దే. ఈనైజాము సైన్యపుఁ జరిత్ర వేరు.

ఇది ప్రారంభమున బహుకాలము వఱకును వైజాము గారి దే. దీనికి సాహాయ్యముగ నాంగ్లేయుల స్నేహమునలన 1766వ సంవత్సరమున సాహాయ్య సైన్య మేర్పడెను. సాహాయ్య సైన్యమే సంధివలన నేర్పరుపఁ బడెనో ఆసంధివలననే ఆంగ్లే యుల కవసరమగు నప్పుడు ఈ నైజాము సన్యమున నిర్ణీత .................................................................................

1

  1. కడప, బల్లారి, అనంతపురము, కర్నూలు, జిల్లాలకు ఈ పేరుపర్తిం చుచున్నది.