పుట:Delhi-Darbaru.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సై న్య స మ స్య

163


మయిన కొంత భాగము పంపఁబడవలసి నట్లేర్పఱుపఁబడెను. ఈయొడంబడిక కనుకూలముగ నైజాము ఎల్లప్పుడును నడుచు కొన లేనందునను నైజాము సైన్యము ఆతని యధి కారుల ఆధీనమునం దున్నంత కాలము అంగ సంపూర్ణత నందకుండు టను బట్టియు ఆంగ్లేయపక్ష పాతి యగు చందూలాల్ ముఖ్య మంత్రి యయిన తరుణమున నాంగ్లేయ రెసిడెంటు ఈనై జాము సైన్యమును సంస్కరించి దాని పై ఆంగ్లేయాధికారుల నియో గించెను..[1] నాఁటనుండి ఆ సైన్యము నందుండు ప్రతి సైనికు నకును అధికారికిని జీతమునకై ఒకవిధముగ రెసిడెంటు ఉత్తర వాది యాయెను. దానివలన నైజాము ఈ సైన్యములకు ఇయ్య వలయు జీతముబత్తెముల నియ్య జాలని తరుణములలో ఆంగ్లేయ వర్తక సంఘము వారు తమబొక్క సమునుండి యియ్యం దొర 'కొని ఆ మొత్తమును నైజాము లెక్కల కెక్కించుచు వచ్చిరి. ఇట్లేర్పడిన ఈసాహాయ్య సైన్యము నైజాము సైస్యము లేగాక వైజామున కితరడండులు గూడ చిల్లరచిల్లరగ నుండెడివి. వెనుక రెయిమండను ఫ్రెంచినాయకుని గూర్చియు అత నిచే నైజాముగారి యుత్తరువుమీఁద గూర్పఁబడిన దండును ..........................................................................................

1

  1. బాఖిర్ జంగు 1902వ సంవత్సంము మార్చి నెలలో కర్జను ప్రభువుకు "వ్రాసిన యుత్తరములో నీ సైన్యము సంస్కరింపఁబడి స్థాపింపఁబడుట నైజా మున కెఱుకయే లేదనుచున్నాడు. పూర్ణముగ సిద్ధమైన తరువాత నతనిము ఖ్యమంత్రియు రెసిడెంటును దానివ్యయమును నైజాముపైఁ బెట్టిరనియు నుడు వుచున్నాఁడు.