పుట:Delhi-Darbaru.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అల్లరులు — కారణములు.

157


హైదరాబాదు ప్రభుత్వమునకును విరోధమగు విధమునఁ బ్రవ ర్తించిరని పంచాయతీదారులు అభిప్రాయపడిరి. వీరి నేర్పఱ చిన యధికారులీ యభిప్రాయముతో నేకీభవించిరి. కావున ముబారీజ్ - ఉద్ - దౌలాను అతని మిత్రులను ప్రభుత్వమువా రవసరమని తలఁచినంత కాలమును చెఱయందిడుట నిర్ణయింపఁ బడెను. అతఁడు గోలకొండయందుఁ గారాగృహమున నుండ గనె మృతి మొందెను.

అల్లరులు— కారణములు

.

1841-42 సంవత్సరములలో నైజాముగారి దేశమం దంతటను అల్లరులు మిక్కుటముగ నుండెను. వీనినణఁచు టకు తాలూకుదారుల సిబ్బందీ లేమియుఁ బనికి రాకుండెను. దీనివలన నీయల్లరులు బలవంతమైనవని తలఁపరాదు. పరి శ్రమఁ జేసిన సైనికు లొక కొందఱు ఈయల్లరుల కన్నిటికిని చాలియుండి రనిన నైజాముగారి మాండలిక సిబ్బందు లేగతి యందుండినదియును విశదముగాఁగలదు. చందూలాల్ మంత్రి యగుటతోడనే రెసిడెంటు జోక్యముక లుగఁ జేసికొని సంస్క . రించి పెట్టిన సైన్యముదప్పుఁ దక్కిన రాజ్యాంగము లన్నిటి యం దును శైథిల్యము ప్రతిదినమును హెచ్చుచుండెను. కావున నల్లరి గాండ్రకు సమయము మిక్కి.లిచక్కనిదిగ నుండెను. ఈ యల్లరు లెట్లు పుట్టు చుండెనో వీనికిఁగారకు లెవ్వరో నిర్ణయించుట గస్టము. దక్షిణాపథముదలి మహారాష్ట్ర ప్రభువు లివ్వానికి