పుట:Delhi-Darbaru.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

హైదరాబాదు సంస్థానము.



జనకులనుటకు గొన్ని కారణములు గలవు. (1) హైదరాబాదు నందీయల్లరి కాండ్ర ప్రతినిధులు మహారాష్ట్ర బ్రాహణు లుగ నుండుట (2) మూకలనాయకులు పదభ్రష్టుఁడయి యుండిన నాగపురపు రాజగు అప్పాసా హేబ్ పేరుఁ బెట్టుకొని వెలఁగుచుండుట(3)దక్ష్మిణమహారాష్ట్ర దేశమున నైజామునకుఁ జేరిన బాదామికోట ఒకమహారాష్ట్రుడే పట్టుకొనుట. కొన్ని యల్లరులకు ముఖ్యమంత్రిగారో లేకున్న తప్పక వారిపుత్రుఁడో ఉత్తరవాదులని యొక చరిత్రకారుఁడు వ్రాయుచున్నాఁడు.[1] *

ఆంగ్లేయుల అభిప్రాయములు.

1848 వ సంవత్సరమున రాజచందూలాల్ రాజీ నామానిచ్చి పనినుండి తోలఁగిపోయిన తరువాత నైజాము రాజ్య కార్యములను స్వయముగ నడుపఁబూనుకొనెను. అంతకుఁ గొంచెము మునువు చందూలాల్' ఆంగ్లేయధి కారులను మరల నేమించుట కొప్పుకొనినను, నైజా మంగీకరింపఁడయ్యెను. ఆ సమయమునం దాంగ్లేయవర్తక సంఘమువారి డైరక్టరులు గవ ర్నరు జనరలు గారి కీ క్రింది విధమున వ్రాసి:-

“(నైజాముగారి) రాజ్యాంగమునందు మనము దగిన సంస్కారములు చేయ మూకు శక్తినిచ్చుటకుఁ గావలసినది నైజాముగారు రాజ్యాంగ విషయములలో మాత్రము జోక్య ము కలుగచేసికొనుట లేదను దృడవాగ్దానమే. ఇదివటికే .........................................................................

  • BriggThe Nizam Vol. I P. II2