పుట:Delhi-Darbaru.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిరిగి చందూలాల్ దుష్పరిపాలన.

153


ఉద్దౌలా సింహాసనమునకు వచ్చెను. ఆంగ్లేయ ప్రభుత్వము వారతనిని నైజామని ప్రకటించిరి. ఆప్రకటనాసమయమున జరి గిన రెండువిశేషములుమాత్రము గమనింపవలెను. అదివఱకును గవర్నరుజనరలు నైజాముగారికి వ్రాయుటలోఁ దన్ను “నాయజ్ మద్' అనఁగా 'కడు పేద' అను తక్కువను' నిరూ పించు పదములతో వర్ణించుకొనుచుండెడివాఁడు. 'నైజాము గారు గవర్నరుజనరలునకు వ్రాయు నెడ 'మాబు దౌలత్ ' అనఁ గా “ప్రభువులమగుమేము" అను గౌరవపదముల నుపయోగించు చుండును. ఆయలవాటును మావ్పించుటకును గవర్నరుజనర లును నైజామును బరస్పర సామ్యము నెఱుక పఱచు - మాటల నుపయోగించుటకును దగిన ఏర్పాటు చేయఁబడెను.


రెండవవిశేషము. ఆంగ్లేయ ప్రభుత్వము వారు నాజిర్ - ఉద్దౌలాను “ పట్టభద్రుఁడవగు నెడ' నీకు స్వాగతమనుటలో నిత రసామంతప్రభువుల కేరికిని యుపయోగింపని “ పట్టభద్రత్వము నుపయోగించుట.

తిరిగి చందూలాల్ దుష్పరిపాలన.

నాజిర్ -ఉద్దౌలా గద్దెనెక్కుట తోడనే తన రాజ్యము లోపలి రాజ్యాంగ నిర్వహణమునంతయును దానె చేసికొనెదన నియు మెట్ కాఫ్ వలన నియమింపఁబడిన ఆంగ్లేయ మండలాధి పతులను దీసి వేయ వలసినదనియు గవర్నరుజనరలుగారికిఁ దెలి యఁ జేసెను. - ఆంగ్లేయ ప్రభుత్వము వారును దానికి వల్లెయని