పుట:Delhi-Darbaru.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

హైదరాబాదు సంస్థానము.


రమునకు 45 లక్షలవంతున నూటికి 25 వడ్డీ చొప్పున నప్పిచ్చ చువచ్చి యుండిరి. ఈయ ప్పేల చేయఁబడెనో "కారణము విశద ముగఁ గానరాదు. నైజామును మోసపుచ్చు నుద్దేశముతో చం దూలాలు చేసినపనియని మాత్రము గనుపట్టుచున్నది. ఎట్లై ననేమి? దీనివలన నాకం పెనీవారు దక్షిణాపథమున నైజామున కంటెను ఆంగ్లేయులకం టెను బలవంతులయు యుండిరి. ఇదేవిధ మున పురాన్ మల్ అనువాఁడు బీరారును గుత్తకు తీసికొని యచ్చట ప్రాముఖ్యత గాంచియుండెను. రెసిడెంటు మెట్ "కాఫ్ గారాకం పెనీని, ఈ పురాన్ మల్ ను నైజాముగారి సంబంధము నుండి తొలఁగించెను. నైజాము ఆంగ్లేయ వర్తక సంఘమువారికి గూడ నప్పుపడియుండెను. ఈఋణములన్ని యును దీర్చుటకు సాంగ్లేయ ప్రభుత్వమువారు నైజాము నకు ఉ తరసర్కారుల కై గట్టుచుండిన పేష్కష్ ను విడిపించుకొని రొక్కము కోటి అరు పదియారులక్షల అరువదియారువేల ఆరువందల అరునదియా' రు రూపాయల నిచ్చిరి.

నాజిక్ ఉగ్లైలా (1829-1857),

సికందరుజా రాజ్యాంగ విషయములలో బహు కాలము వి శేషము జోక్యముపుచ్చకొనుట మాసి వేసి మౌనమున కాల ముగడపుచునుండి 1829 వ సంవత్సరము 'మే నెల 24 న తేది పర లోకప్రాప్తిఁ బెందెను. అతనికిఁ దరువాత నాతనిపుత్రుఁడు నాజర్