పుట:Delhi-Darbaru.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

హైదరాబాదు సంస్థానము.


మైసూరునంధి' (1799)

మైసూరనఁబడుభాగమును విభజించి యుండినచో నై జూము కు మిక్కిలి బలమగు దుర్గములు చేజిక్కి యుండును. అప్పటి కట్టి యవకాశమునైజామున కిచ్చటతగదని లార్డు వెల్లస్లీ కి దోఁచెను.*[1] దానివలన మైసూరు విభజింపఁబడక మొత్తముగఁబూర్వపు రాజుల 'సంతతివాఁడగు కృష్ణ రాజ ఒడయరు బహదూరుగారి కియ్యబడె ను. అతని సాహాయ్యర్థ మా రాజ్యములో నాంగ్లేయ పటాలము లు నిలుపఁబడెను. వానికగు న్యయమునకై యితఁడు సంవత్సరము నకు ఏడులక్షల వరహా లియ్య నియ్యకొనెను. ఇట్లు పూర్వపురాజ సంతతివారికి మైసూరునిచ్చి టిప్పుసుల్తాను గడించియుండిన తక్కి న దేశమును ఆంగ్లేయవర్తక సంఘమువారును, నైజామును, మహా రాష్ట్రులును బంచుకొనునట్లేర్పఱుపఁబడెను. మహారాష్ట్రులు టిప్పుతోఁ బోరాడుటలో కలిసి పని సేయకున్నను వారిని గూడ నీసంధిలోఁ జేర్చుకొని వారికొక కొన్ని జిల్లాలనిచ్చుటకు పేష్వారావు పండిత ప్రధాన్ గారికిని, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియాకం పెనీ బహదూరుగారికిని, ఘనత వహించిన 'నవాబు నైజాము - ఉద్ - దౌలా ఆసఫ్ జా బహదూరుగారికిని, మహా రాజ మైసూరు కృష్ణరా రాజ బహదూరుగారికిని గల స్నేహ మును రాజకీయసహవాసమును నిలుపుటకై" యని నుడువఁబడి ...................................................................................................

  • ఈ యంశము వెల్లస్లీ గారి లేఖవలన దెలియుచున్నదని ఫ్రేజరను చరి త్రకారుఁడు వ్రాయుచున్నాఁడు.