పుట:Delhi-Darbaru.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

టిప్పూప్రయత్న ములు - పతనము.

137


ములు గల్పించుకొని వారినిగూడ నాంగ్లేయులకు విరోధులుగఁ జేర్చుకొనఁ జూచుచుండుటయే గాక అరేబియా పరిపాలకుఁడు మున్నగు మహ్మదీయ ప్రభువుల నందఱును 'సాయము చేసికొని స్వమతావలంబకులకు మతాభిమానమును బురికొల్పి యపరిమిత సైన్యములఁ బ్రోగుచేసి యాంగ్లేయులను మొదలంటఁ భారఁ దోలఁ బ్రయత్నించుచుండెను. హైదరాబాదునందు పైనివర్ణి చిన విజయమునకు మూలకారకుఁడగు లార్డు వెల్లస్లీ గవర్నరు జనరలయి ఈ దేశమునఁగాలిడి యిడకమున్నె యీవిషయమును జక్కగ గ్రహించి తన పై యధికారులకుఁ దెలిపి టిప్పూకార్య ములకు భంగముగూర్చుటకు వలయు సాధనములు వెదకుట- యందు మిక్కిలిశ్రద్ధ వహిం చెను. హైదరాబాదునందలి ప్రెంచి బలమును విచ్ఛిన్నముచేసి ఆసంస్థానాధీశ్వరుని యొద్ద తమ శక్తిని దృఢపజచుకొని, వెంటనే అకస్మాత్తుగ దండునాయ త్త పఱచి టిప్పూసుల్తాను పై కనిపెను. ఇచ్చట నాల్గవ మైసూరు- విగ్రహము వర్ణించు టవసరముగాదు. దానియందు టిప్పూ యోడిపోయి ప్రాణము లర్పించెనని నుడివిన చాలును. అతని మరణానంతరమా రాజ్య మంతయును నాంగ్లేయులయు నైజాముయొక్కయుఁ జేతులలోఁబడెను. దానిని వీరలు బంచు. కొనుటకై 1799వ సంవత్సరమున మైసూరుసంధి జరిగెను.