పుట:Delhi-Darbaru.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంగ్లేయులతో సంధి. (1800.)

139


నది. ది. 1 [1]పేష్వా యీసంధికి నొప్పుకొనిన వాఁడు గాఁడు. కావున నతని కయి వేరుచేసి పెట్టిన భాగమునందు మూడింట రెండనవంతు నైజామున కియ్యఁబడెను. "మొత్తముమీఁద నతనికి మైసూరు సంధివలనను 1792 లో టిప్పుతో జరిగిన సంధివలనను సంవత్సర మునకు కోటిరూపాయ లాదాయము రాఁగల దేశము చెందెను. కాని బహు కాల మిది యితని స్వాధీనమున నుండినది కాదు.

ఆంగ్లేయులతో సంధి. (1800.)

టిప్పూసుల్తానును తుదముట్టించుటను జూచి మహా రాష్ట్రు లు అసూయాపరనశులై యుండిరి. వారు రానురాను ఆంగ్లే యులయెడవిరోధభావము సభివృద్ధిఁ జేయుచుండుట విశదమయ్యె ను. కావున నాంగ్లేయులు నైజాముతోడి సంబంధము నింకను బలము చేసికొనఁ బ్రయత్నింప వలసి వచ్చెను. ఇదివఱి కతనికిని దమకునుగల పరస్పర సమానమిత్రభావము గష్టసమయములఁ “బనికి రాక పోవచ్చునని యెంచి తామతనికి సంరక్షుకులయి తమ సలహాల కతఁడు ఎదురు చెప్ప లేకుండునట్లు నియమించు. కొన వలెనని వీరికిఁ దోఁచెను. ఇంతియగాక, ఆతని దేశము మహారా ష్ట్రుల దేశవు సరిహద్దులలో నుండుటవలన - నాతని దేశమునందుఁ దమబలములు వలసినంత. యంచుటగూడ లాభ కారియేయని .........................................................................................

I

  1. C. N. Atchinson's collection of treaties, En gage-ments & sannads. Vol. 5 Page. 9.