పుట:Delhi-Darbaru.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1766 సంవత్సరపుసంధి.

119


నికి చెల్లించునట్లును ఏర్పఱచుకొనిరి. ఇందులో మూ ర్తిజూ నగ రము (గుంటూరు) మాత్రము నైజామువలన నతని తమ్ముడగు బజల తుజంగుకు జహగీరుగా నియ్యఁబడి యున్నందున నది యాతని జీవ మున్నంత కాలము ఆంగ్లేయ వర్తక సంఘము వారికిఁ జేరుట లేదనియు మూర్తిజూ నగరము కర్నాటకపు సరిహద్దు లలో నుండుటంబట్టియు, గర్నాటక మాంగ్లేయుల సంరక్షణ లో నుండుటంబట్టియు, బజలతుజంగుచే గర్నాటకములో నేమైన అల్లరులు జరుపఁ బడినచో మూర్తిజా నగరమును స్వాధీ నము చేసికొనుట కాంగ్లేయుల కధికార మున్నదనియుఁ దీర్మా నింపఁబడెను. వీరు గట్టదగిన తొమ్మిదిలక్షులకు లెక్క లెట్లు తేలవ లెనన్న వీరు నైజాముకొఱకా యత్తపఱచి పంపు దండు లకుగాను సెలవగు మొత్తము ఈ మొత్తమునకు లోఁబడినదైన చో మిగత బాకీ వీరు నైజాముగారి బొక్క సములోనికిఁ జెల్లించ వలసిన దే. తోమిదిలక్షలకు మిం చెనేని వీరే పెట్టుకొనవలెను. ఇదేసంధినిబట్టి కొండపల్లి దుర్గములో నాంగ్లేయుల సైన్యములు మాత్ర ముండవలసినదనియు నైజాముగారి పక్షమున వారి కిల్లా దారుఁడు (అనఁగా కోటకథిపతి) నేమింపఁ బడవలసినదనియు నొడంబడిక జరిగెను. ఆంగ్లేయులకు ధృవ కౌలున కీయఁబడిన మండలములోని వజ్రపు గనులును, ఆ గనులుగల గ్రామము లును నైజూము గారికే చెందవలసినది. ఆంగ్లేయులును నైజా