పుట:Delhi-Darbaru.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంగ్లండునందలి కక్షులు..

95.


1906న సంవత్సరము మే నెల 1 న - తేది యిలు సేరెను. ఇంగ్లాండున రాజ్యాంగము నడుపు నట్టి మంత్రిమండలము (Cabinet) 1905 మొదలు 1908లోపల రెండు మారులు మారుట తటస్థించెను.. ఆ దేశమున మంత్రులు జన ప్రతినిధిసభ (House of commons.) లో నుండి యెన్నికొనఁబడు చుండుటచేతను, ప్రతినిధి సభకు సభ్యులను ప్రజలే నిర్వచించుటవలనను మంత్రులు మారుట యనిన సర్వరాజ్యాంగాధి కారులును షూరుటయే యయి, ప్రజలు దమహక్కుల ననుసరించి నూతనముగ ప్రతినిధి సభను నిర్వ చించుటే యగు చున్నది. ఇట్టి మార్పులు గలుగు కాలమునఁ దట స్థించు విశేషాంశములన్నియు జార్జి ప్రభువు ఇంగ్లాడున నున్నను లేకున్నను గూడ మిక్కి-లి శ్రద్ధతో గమనించు చుండెను. 1908 వ సంవత్సరమున నితఁడు కనడాకు మరల దర్శనమిచ్చి రా వెడ లెను. అచ్చట నీతని యొక్కయు రా కొమారి తెమేరీయొక్క " యు విగ్రహములతో తపాలాబిళ్లలు అచ్చు వేయఁ బడియెను.. వీరి జ్ఞాపకార్థమయి పతకముల చ్చొ త్తింపఁబడిపంచి పెట్టఁబడెను. 1910 వ సంవత్సరమున నింగ్లాండుకు ప్రభువుల సభ వారు (House of Lords.)జన ప్రతినిథి సభ వారి చే సిద్ధపఱుపఁబడిన బడ్జె ట్టు బిల్లును అనఁగా ముందు సంవత్సరపు ఆదాయవ్యయ పట్టికను త్రోసివేసిరి. దానివలన రెండు సభల వారికిని భేదములు గలిగి యప్పటి మంత్రిమండలమువారు రాజు ననుమతిపయి పార్లమెంటు కూడుటను నిలిపి ప్రజలను వేరొక ప్రతినిధి సభ నేరుకొనుఁడనిరి.