పుట:Delhi-Darbaru.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

శ్రీరా జ దం పతులు,



ఇంగ్లాండున బహుకాలముగ రాజకీయ కక్షలు రెండుగలవు. లిబరలుల కక్ష యొకటి. వీరెప్పుడును సంసార పక్షమువారు. కాంసర్వేటివుల కక్ష రెండవది. వీరు సర్వ సాధారణముగఁ బూర్వ పద్ధతుల విడచువారుగారు. పార్లమెంటు సభయందు, అందుముఖ్యముగఁ బ్రతినిధి సభయందు, రెండు తెగల వారును నుందురు. కాని ఏ తెగ వారి సంఖ్య యెక్కుడుగ నుండునో ఆ తెగ సభ్యులనుండియే మంత్రులను రా జెన్ను కొన లయును. వీరె రాజ్య కార్య నిర్వాహకులు. కావున వీరి కక్షయ తత్కాలమునకు నధికార కక్ష. 1910 నసంవత్సర మునకుఁ బూర్వము లిబరలు లే నధికార కక్షగ నుండిరి. ఆ సంవత్సరమున నడచిన నిర్వచనమునఁ గూడ వీరే యధికార కక్షయయిరి. అయినను వీరి సంఖ్య మాత్రము మొదటి కంటెఁ దక్కువయయి యుండెను. ప్రజాప్రతినిధుల 'సభకును ప్రభువుల సభకును గల పరస్పర సంబంధమును గుజించి వివాదములు ప్రారంభమగుట వలన రాజునకును నతని సాహాయ్యులకును మనోవ్యధ గలుగఁ జొచ్చెను. ఎడ్వర్డు చక్ర వర్తి యప్పుడు కొంత జబ్బు వడియుండెను. అట్లుండియు 1910 వసంవత్సరము ఫిబ్రవరి నెలలో నతఁడు పార్లమెంటు సభ, దెఱ చెను. అదియే యాతని కడపటి రాజకీయ కార్యమయి పరిణ మించెను. మే నెల 5 వ తేది యతఁడు మిక్కిలి యెక్కుడగు ఋజచే బాధింపఁ బడుచున్నాఁ డనువార్త బయట వెడ లెను.