పుట:Delhi-Darbaru.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94.

శ్రీరా జ దంపతులు.


మాకు పరిచితులగుదురుగాన నీ దేశము దమ సంరక్షణకుఁ బాత్ర మనివక్కాణి, పనిండు. దయయుంచుఁడు. భారతీయుల మఱవఁ బోకుఁడు. ఇగ్లాండు నందలి నాలుగుకోట్ల బలె వీరును తమవ్ర జలేయనునది జ్ఞాపకముంచుకొనుఁ. వీరికి నలయు విషయ ములలో ముఖ్య తమము పరిపాలకుల నిర్మలసానుభూతి" యని మోకారించి నిలచి ముకిళిత కరకమలుండయి విన్నవించెను. ఈ పదములు జార్జి ప్రభువు మనస్సునాకర్షించె ననుటకు సందియము లేదు.. వెటనే యతడు పత్రికా ప్రతినిధిని దయారస పూరిత వాక్యములతో లేవఁ జే.సి " నిన్ను గాంచుటచే నాకు మిక్కిలి . యానందము గలిగినది. భారతీయుల మఱనకుందునని. యభ యమియ్య మనుచున్నాఁడవు. సరి. నే నెప్పుడును వారిని ముఱ వను. మఱవఁజాలను. ఎల్లప్పుడును గ్నాపకముంచు కొనుటయే కాక దేశీయులు నాకొసంగిన యత్యుత్తమ స్వాగతము చే నేనెంతయలరి నదియుఁ దప్పక నాతండ్రిగారి కెరుక పరచెదను. మీయెడనింకను నెక్కుడు సానుభూతి: గనుపఱచుట గ ర్త్వవ్య మని నా తండ్రిగారితో జెప్పుట నాకు సంతస మీను ధర్మము. భరత వర్షమును గుఱించి నామనన్సున నిశ్చల భానములు నెలకొని యున్నవి " యని ప్రత్యుత్తర మిచ్చెను. "

ఇంగ్లండు నందలి కక్షలు.

జార్జి ప్రభువీ విధమున 'భార తీయుల నిరాశనుడిపి వారిమన ముల నుల్లాసమునించి, యింగ్లాడునకుఁ బయనమయి పోయి