పుట:Delhi-Darbaru.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హిందూ దేశమునకు ప్రయాణము.

83



నావికా నాయకుఁడని లోకమున విరివిగా ప్రసిద్ధి గాంచిన యడ్మి రల్ టోగో ఊర్ట్సరు' పయిఁ బదు నెనిమిది మాసములు పరిశ్రమ చేసినాఁడనుట ప్రతి “ఊస్టరు' బాలుఁడును గారవ ముతో స్మరింప వలెను.” అని నుడి వెను. జసానునకు నావికా నాయకత్వమున నగ్ర స్థానమును సంపాదించి పెట్టిన 'యడ్మిరల్ టోగోయింగ్లండునందలి యీ యీ ఊర్టరునావలోఁ బని నేర్చుకొని యచ్చట నెల్లరకును గావలసిన వాఁడై నెగడినవాఁడు. ఇంగ్లాం డుతో నిట్టి సంబంధము గలవాఁడు గావున నే జార్జిచక్రవర్తి గారి కట జరగిన పట్టాభిషేక మహోత్సవమును దిలకింప 'నాతఁ డాహూయమానుఁ డయ్యెను. అడ్మిరల్ టోగో యెడలను, “పోర్టు ఆర్థరును' రుష్యా వారి నుండి పట్టుకొనిస 'నోగీ' సేనాధి పతి యెడలను జార్జిచక్రని కత్యాదరముగలదు. వారి మూల మునను, నితర ప్రముఖులతో సంభాషించుట వలనను, గ్రంథావ లోక సమునను జార్జిచక్రవర్తి యు మేరీ చక్రవర్తినియు జపాను చీనాలను గూర్చి చక్కఁగ నెఱింగికొని యున్నారు.

'హిందూ దేశమునకు ప్రయాణము

.

1905వ సంవత్సరమున మార్చి నెలలో జరిగిన ఆంగ్లేయ రాజకీయ సభయందు వేల్సు ప్రభువును బ్రభ్వియు భరతవర్షమును దర్శించి వచ్చుట కై రు 3,00,000లు కర్చులకుగాను నుప యోగించు కొనవచ్చునని తీర్మానింపఁబడెను. జార్జి ప్రభువు బొంబాయి గ్రామరక్షక సంఘమువారి సమ్మాన పత్రికకు బదులు