పుట:Delhi-Darbaru.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

శ్రీ రా జ ద ంప తు లు.


చెప్పుటలో వక్కాణించిన విధమున నతఁడీ దేశమునకు వచ్చుటకుఁ బూర్వమె యిద్దానం గుఱించి శ్రద్ధఁ జేసి చదువుకొని యుండెను. కాని గ్రంథస్థ వర్ణనల వలన గ్రహించు జ్ఞానము నకును స్వయ ముగఁ బరిశీలించి విమర్శించి సంపాదించు జ్ఞానమునకును గడు దూరముగ దా. జార్జీ ప్రభువు దమసామ్రాజ్యమునకు శిరోమణి యనఁదగు నీభరతఖండమును గన్ను లారఁ జూచు వేడుకతో నా సంవత్సరము అక్టోబరు నెల 19న తేది యిలు నెడలి బయలు దేరెను. కన్న బిడ్డలను వెనుక విడనాడి ప్ర యాణమునకుఁ దరలుట యేరికై నను గష్టమే. మేరీరాణి గారికిఁ గూడనట్టి భావము పొడమెను. కాని యాయమ దన బిడ్డలు అలెగ్జాండ్రా మహారాణిగారి సంరక్షణలో నుందు రను గొప్పనమ్మకము వలన వారినుండి కొంతకాలము వేరుపడ వలసి యుండుటకు మనస్సును గుదుర్చుకొని భర్తతోఁ గూడ 'రినాన్' అను ఓడనొక్కి ప్రయాణమాయెను. భార్యా భర్త లిరువురును బొంబాయికి వచ్చి చేరిరి. భారతపుత్రు లచ్చట దమ ఈ భవిష్యత్పరిపాలకుల కొసఁగిన స్వాగతమును వర్ణింప నలవిగాదు. స్వాగత పత్రికకుఁ బ్రత్యుత్తర మిచ్చుటలో జార్జ్ ప్రభు విట్లు పలికెను:-

"ముప్పది సంవత్సరముల క్రింద ఒకనాఁడు నా ప్రియజనకుఁడగు చక్రవర్తి యీ ప్రాంతముననె నిలువ బడి తన జీవితమునందు భరతఖండమును జూడవ లెననుట