| లేడ్వురు మదమత్తవృషమూర్తులై చొచ్చి యనిశంబు బాధింప నతఁడు వీనిఁ | |
తే. | శౌరి యట కేగి వృషముల సంహరించి, భువనమోహిని నీలను స్వవశఁ జేసి | 44 |
క. | ఆనీలాకన్య యశో, దానందులపట్ల నెల్లఁ దగుభయభక్తు | 45 |
వ. | అంతఁ గ్రమక్రమంబున. | 46 |
సీ. | మొనలు చూపెడి పినపినమొల్కచనుదోయి యలఁతిపయ్యంటకు నాస సేయఁ | |
తే. | బొన్నపొక్కిలి లోఁతైన సన్నమైన, నడుము బిగిఁజూపు నునుబోఁకముడికి లోఁగ | 47 |
క. | మదవృషభంబులఁ గూలిచి, సుదతీమణిఁ దెచ్చునపుడు చూడఁగ హరికిం | 48 |
సీ. | కలికిసింగారంపుమొలకలో యన ముఖాబ్జమున నూనూఁగుమీసములు దనరఁ | |
తే. | జవ్వనంబున గోపాలచక్రవర్తి, నిండుపున్నమచందురు గండుమిగిలి | 49 |
ఆ. | పిన్ననాఁటనుండి కన్నులకింపయి, యున్న రాధమీఁదఁ గన్ను వేసి | 50 |
సీ. | ఫలపుష్పములు దెచ్చి పట్టుమంచును బైఁట నించుచో గుబ్బఁ దాఁకించుఁ గేల | |
తే. | చిలుకసాంబ్రాణితేజివజీరుఁ గేరు, కమ్మనెమ్మేన వగవగ సొమ్ములూని | 51 |
క. | శౌరి కడుఁబ్రేమ నిటువలెఁ, జేరిక సేయంగ సిగ్గు చిత్తము గరఁగన్ | 52 |
క. | కిలికించితవతి కృష్ణుం, దిలకించఁగసాగె సారెఁ దీరగుగుబ్బల్ | 53 |