తే. | అప్పు డాశ్చర్యమును మోద మతిభయంబు, వెనుకొనఁగ మంత్రసాని వేవేగ వచ్చి | 5 |
సీ. | వెడఁదకన్నులవాఁడు నెడఁదమానికెపుఱా వెడఁదకన్నులమిన్న నిడినవాఁడు | |
తే. | దేవదేవుఁడు దేవకీదేవిగర్భ, జలధి జనియించె సంపూర్ణచంద్రులీల | 6 |
క. | అని తెలిపిన వసుదేవుఁడు, విని రొద వల దనుచు ననుచు వేడుకతోడన్ | 7 |
చతుష్కందము. | శ్రీవాసుదేవప్రియస, ద్భావావేదాంతవాదఫలితామోదా | 8 |
క. | పటుమతి ననుమానోక్తిన్, ఘటియింతు “జగత్సకర్తృకం కార్యత్వాత్ ఘటవ త్త” ని తాదృశు నిను, నిటువలెఁ గాంచితిమి చిత్ర మే మనవచ్చున్. | 9 |
తే. | అని పొగడ శౌరి దయ మీఱి యాదివృత్త, మంతయును దెల్ఫి భావివృత్తాంతములును | 10 |
క. | విడికెంపుపడగగొడుగులు, కడువేడుక శేషుఁ డూనఁ గాళిందియు గా | 11 |
తే. | తెచ్చి కంసుని కొసఁగ నుద్వృత్తి నెగుర, వ్రేసి యసి పూన నద్దేవి మింట నిలిచి | 12 |
సీ. | దళపుష్పఫలసమాకులకోకిలమిళిందకీరంబు లగుచు శృంగారవనులు | |
తే. | లలరె వింతగు మాధవోదయమునందు, సప్తకులపర్వతంబులు సౌరధేను | 13 |
తే. | అభినవగుణైకసామగ్రి నుభయకులయ, శోదయై మించునట్టియశోద యంత | 14 |
తే. | మేదినీనాథ నెలలు తొమ్మిదియు మోసి, కన్నదేవకి యటులుండ కడకు నందు | 15 |
ఉ. | జోలలు పాడఁగా మిగుల సొంపగుపున్నమచందమామనుం | |