| లాలనమించుజిట్టకములం గనుదోయి చెలంగి చూడఁగాఁ | 16 |
తే. | కంసుపంపునఁ బూతన కామరూప, యగుచు జనుబాలువిష మీయ నమృత మొసఁగె | 17 |
తే. | బండిఁ బడఁదన్నెఁ దొడలపైఁ బండి పర్వు, తల్లికి ఘటించె సురగాలి త్రు ళ్లడంచె | 18 |
తే. | అస్తిభాతిప్రయాత్మకమైన బ్రహ్మ, మాకృతి వహింపఁజూచి కృష్ణాఖ్య యిడియె | 19 |
సీ. | సిగను జుట్టిన తావి చెంగల్వ లరవీడఁ గొనరావిరేక ముంగురుల నాడ | |
తే. | నందె గాలిడి యొకపాణి యవని నూఁది, యన్యకరమున నవనీత మవధరించి | 20 |
ఆ. | సగమురాత్రివేళ జనియింపఁగానేమొ, జారచోరలీల మీఱె శౌరి | 21 |
క. | నందునియింటను రాధ య, నందగునొకకన్య జవ్వనంబునఁ దనరుం | 22 |
గూఢచతుర్థిసీసము
| కలికిచూపును గుచంబులు మోవి మోమును గమలారిబింబవిభ్రమము గాంచి | |
తే. | రతికిఁ గుచఫలరత్నదర్పణతమోణు, కాండశైవాలశష్కులికాశుకీకి | 23 |
క. | వల్లభునిఁ బ్రోచురతిగతి, నెల్లప్పుడు ఱొమ్ము డించ కెంతయుఁ దమి న | 24 |
సీ. | తొడలపై నుంచి యుగ్గిడువేళఁ జికిలిపెందొడలసం దొయ్యనఁ బుడికిచూచు | |
తే. | బట్టుకొని లేచుగతి నీడ్చుఁ గుట్టుకొంగు, తొలఁగి జఘనంబు గనుపింపఁ గెలసి నవ్వు | 25 |