| కటికుచంబుల నీర్ష్య గాంచెనే నేఁడైన బలువుఁజూపె నదేమొ యలఁతినడుము | |
తే. | పనులు దఱచయ్యెనే యింత బడలనేల, రేలు వేఁగింతురే పగలేల నిద్ర | 14 |
ఉ. | మేటిగఁ జైత్రశుద్ధనవమీబుధవారపునర్వసూడుక | 15 |
తే. | అచ్యుతాంశార్ధమున రాముఁ డవతరింప, హరిచతుర్థాంశమునఁ గైక భరతుఁ గనియె | 16 |
క. | గుణవతి సుమిత్ర సుజన, ప్రణతుల హరి పరకపరకపా లొసఁగఁగ ల | 17 |
సీ. | దివి పిక్కటిల మ్రోయు దివ్యదుందుభుల సంరావంబు లభ్రగర్జనలు గాఁగ | |
తే. | జనముదశ్రుప్రవాహము ల్సందడింప, మునిజనానందకందము ల్మొలకలొత్త | 18 |
వ. | అంత. | 19 |
క. | సరభసగమనఝళంఝళ, చరణమణీనూపురములు సగ మెఱిఁగింపం | 20 |
మ. | ఘనసంతోషము మీఱఁగా దశరథక్ష్మాపాలచంద్రుండు వే | 21 |
తే. | దశరథుఁడు రాముఁడై పుట్టె ధరణిలోన, నాత్మయే పుత్రుఁడై పుట్టు ననఁగ వినమె | 22 |
క. | పుత్రోత్సవ మొనరించెన్, ధాత్రీపతి రత్నధాన్యధనముల విశ్వా | 23 |