వ. | అనినఁ జతురవచనరచనాపటుం డగు కుహనావటుం డిట్లనియె. | 98 |
చ. | అడిగినవారిఁ జూచిన భయంపడి వెల్వెలఁబాఱుమోముతో | 99 |
మ. | అమరారీశ్వర బ్రహ్మచారులకు రాజ్యం బేల కాంక్షించుమా | 100 |
మ. | అవనీదానమహత్త్వముం దెలియలే రంభోజగర్భాదులు | 101 |
తే. | విప్రవరునకుఁ దూమెఁడు విత్తనముల, నేల యొసఁగిన ఫలము వర్ణింతు వినుము | 102 |
క. | చెలఁగుచు నిద్దుము విత్తన, ములనేల కుటుంబి కొసఁగు పుణ్యాత్మునకు | 103 |
ఉ. | పుట్టెఁడు విత్తనంబులకు భూమివిశిష్టున కీయఁజాలు నా | 104 |
క. | కల దొకయితిహాసం బిం, దులకు న్వినుపింతు వినుము దురితము దొలఁగు | 105 |
సీ. | మును బ్రహ్మకల్పంబునను భద్రమతియను విప్రోత్తముఁ డొకండు వేదశాస్త్ర | |
తే. | గోరి కౌశాంబిలోన సుఘోషువలనఁ, బంచహస్తావనిఁ బ్రతిగ్రహించి విష్ణు | 106 |
తే. | కాన భూదాన మొనరించుకంటె నధిక, మైన దానంబులేదు నే నడిగినట్టి | 107 |