పుట:Dashavathara-Charitramu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దృశ్యశరీరుఁ డచ్యుతుఁడు దృశ్యుఁడుగా ముదమంది కశ్యపా
దృశ్యవలగ్న యిట్లని నుతించె నిజోచితవాక్యవైఖరిన్.

48


ప్రాకృతసీసము.

ళచ్ఛిత్థణాహేయ లలి అ హత్థపయో అ పొమ్మలోఅణళో అపూ అణిజ్జ
ఖఅవర ఆణేఅ గఅరాఅరఖ్ఖ అ[1]ఖ అరఖిందు సిఖి అరఅణి ఆస?
[2]ఈసరజణల మహేసరభ అణిజ్ఞ దిక్కమజాహ? తెళ్లొక్కణాహ
పుణ్నమి అంకలావణ్నస్స మందరఖి ఇధరధారఅ కిసణవణ్న


తే.

భక్తకామి అఫలదాణపారి ఆఆ, యాయయూయ జణేఝ్ఝేఅ యాయరూఅ
వాసుదేవ సఆణంద వణఅణేహ, [3]కిత్తణిజ్జణవ హ్నీర ఆ?దేఅ.[4]

49


తే.

అనుచు నప్రాకృతచరిత్రయైన యదితి, ప్రాకృతోదితవైదగ్ధిఁ బ్రస్తుతింపఁ
బ్రాకృతగుణవ్యతీతుండు భక్తసులభుఁ, డైన ప్రహ్లాదవరదుఁ డాహ్లాదమునను.

50


తే.

మొలకనవ్వులఁ జికిలివెన్నెలలు గాయఁ, గాయ మెంతయుఁ బడలెనుగా యటంచు
నతిపవిత్రకరంబున నదితిమేను, నిమిఱి నీవాంఛితం బేమి నెలఁత యనిన.

51


క.

స్వామివి జగముల కంత, ర్యామివి జనములకు జపిత కర్థ మొసంగే
సామివి భక్తుల కంతిక, గామివి నీ వెఱుఁగనట్టి కార్యము గలదే.

52


క.

ఐన న్వినుపించెద విను, శ్రీనాయక మత్తదైత్యసేనలచే నా
సూనులు వసూనులై హరి, సూనుప్రభృతులును దలకఁ జూడంగలనే.

53


క.

దితిసుతుల సంహరింపక, యతులితమైనట్టి వారియైశ్వర్యము నా
సుతుల కొసంగుము చాలును, దితిజులు నాసుతులు గారె దీనశరణ్యా.

54


తే.

అనిన నెంతయు మెచ్చి మాయమ వౌదు, వదితి యని కౌఁగిలించి దైత్యారి యనియె
సవతిబిడ్డలయందు మత్సరము లేని, యపుడె నీసాటి గలరె యీయఖిలమునను.

55


చ.

తనసుతులం బరాత్మజులఁ దద్దయుఁ బ్రేమఁ దగన్సమంబుగాఁ
గనుఁగొను పుణ్యమూర్తులకుఁ గల్గదు నందనశోక మింక నీ
తనయుఁడనై జనించి బలిదర్పము మాన్చి తదీయలక్ష్మి నీ
తనయుల కిత్తు నీతినయధర్మవివేకము గాఁగ నావుడున్.

56
  1. ఖిందసింఖయరణీయయాస
  2. యాసకజణయ
  3. కిత్తణిజ్జవయహ్నీరఖేయదీయ
  4. ఛాయ. లక్ష్మీస్తనాధేయ లలితహస్తపయోజ పద్మలోచనలోకపూజనీయ
         ఖగవరయానేయ గజరాజరక్షక.................
        ఈశ్వరజనక మహేశ్వర భజనీయ...... త్రైలోక్యనాథ
        పూర్ణమృగాంకలావణ్యాస్య మందరక్షితిధర ధారక కృష్ణవర్ణ
    తే. భక్తకామితఫలదానపారిజాత, యాయజూక జనధ్యేయ (జ్ఞేయ) యాగరూప
        వాసుదేవ శతానంద వనజనాభ, కీర్తనీయజనీ.......