పుట:Contributing to Wikipedia brochure draft version 7.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజువల్ ఎడిటర్ తో సవరణలు

విజువల్ ఎడిటర్ తో వ్యాస సవరణ -చొప్పింత అదేశాలవరుస
విజువల్ ఎడిటర్ తో వ్యాస సవరణ-మూలము సవరించు
విజువల్ ఎడిటర్ తో వ్యాస సవరణ-మూస వాడుక సవరించు

‌విజువల్ ఎడిటర్ తో మీరు చేసే సవరణలు చేసేటప్పుడే సరైన తీరులో కనబడతాయి కాబట్టి, విషయంపై ధ్యాస పెట్టవచ్చు. ఏ భాగాలను మార్చాలో వాటి పక్కన వున్న సవరించు బటన్ పై నొక్కి సవరణ ప్రారంభించండి.

సవరణల పనిపట్టీ

ఈ పనిపట్టీ ద్వారా రూపం మార్చటము, వనరులు బొమ్మలు చేర్చటం మరియు పేజీలో ప్రత్యేక లక్షణాలుగల మూసలను (వ్యాస ప్రారంభంలో వుండే సమాచారపెట్టెలు లాంటివి) మార్చడం చేయవచ్చు. సవరణ పూర్తయిన తర్వాత పేజీ భద్రపరచు నొక్కండి


ప్రవేశిక

మొదటి వాక్యం విషయానికి నిర్వచనం ఇస్తుంది. వ్యాసంలోని విషయాలను సంగ్రహంగా తెలుపుతుంది. ఈ ఒక్క విభాగానికే శీర్షిక వుండదు.

సమాచారపెట్టె
కొన్ని వ్యాసాలకు సమాచారపెట్టెలలో వ్యాసానికి సంబంధించిన ముఖ్యాంశాలు చేర్చుతారు. ఉదాహరణకు దేశం, నగరాలు, గ్రామాలు వంటి వ్యాసాలకు కొన్ని గణాంక వివరాలను, ప్రదేశ వివరణా పటాలు, చిహ్నాలు, ఛాయాచిత్రాలు, ఇతరవివరాలు వుంటాయి.
బొమ్మలు

ఉచిత లైసెన్స్ జతపరచిన బొమ్మలు, ఇతర మీడియా ఫైళ్ళను వికీమీడియా కామన్స్ లేక స్థానిక ప్రాజెక్టులో చేర్చవచ్చు.

వ్యాసంలో విషయ వివరణల భాగం

శీర్షికలు - మరియు కొన్ని సార్లు ఉపశీర్షికలు వ్యాసాన్ని విభాగాలుగా విభజిస్తాయి. వాటితో విషయసూచిక తయారవుతుంది. ఒక్కో విభాగం సాధారణంగా విషయం గురించిన ప్రాధాన్యత గల అంశం తెలుపుతుంది. అందువలన చదువరులు వారికి కావలసిన సమాచారం కొరకు నేరుగా వెళ్లవచ్చు.

మూలాలు

వ్యాసంతో పాటుగా వరుసలలో మూలాల గుర్తులు, ఆ పాఠ భాగానికి మూలాన్ని తెలుపుతాయి. మూలాల వివరాలు వ్యాసం చివరలో మూలాల విభాగంలో కనబడతాయి.

మూస

మూసలనబడే మరల వాడగలిగే భాగాలు, సమాచారాన్ని ప్రామాణికంగా ప్రదర్శించడానికి, వ్యాస సమస్యలను వీక్షకులకు హెచ్చరిక ద్వారా తెలుపుటకు వాడతారు.

అనుబంధాలు, పాదసూచికలు

వ్యాసంలో ముఖ్య భాగాల తరువాత విభాగాలలో అదనపు సమాచారంగా సంబంధిత ఇతర వ్యాసాల లింకులు (ఇవీ చూడండి), మూలాలు వివరాలు( మూలాలు), మరింత సమాచారానికి ఇతర జాలస్థలుల జాబితా వుంటాయి.