పుట:Contributing to Wikipedia brochure draft version 7.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వికీ కోడ్ (మార్కప్) తో సవరణ

వ్యాస తొలిభాగం సవరణ-వికీకోడ్(మార్కప్)
వ్యాస మధ్యభాగం సవరణ-వికీకోడ్(మార్కప్)
వ్యాస చివరిభాగం సవరణ-వికీకోడ్(మార్కప్)

వికీపీడియా వ్యాసాలను సాంప్రదాయకంగా దిద్దుబాటు చేయడానికి వాడే రూపమే వికీ కోడ్(మార్కప్) . కొన్ని విహరిణి(Browser) లలో ఇదొక్కటే పనిచేస్తుంది. మీరు వీటి గురించి అర్ధం చేసుకుంటే దీని ద్వారా విషయాన్ని సున్నితంగా కావలసిన తీరులో ప్రదర్శించవచ్చు . ఒక వ్యాసానికి వికీ మార్కప్ క్రింద చూపించబడింది. దీనిలోని కనబడే లక్షణాలు ఎన్ని విజువల్ ఎడిటర్ లో కనబడతాయో చూడండి.

బొమ్మ

వికీ కామన్స్ లో లేక స్థానికంగా వున్న ఫొటో శీర్షిక కు ఇరువైపులా రెండు స్క్వేర్ బ్రాకెట్లు ఉంచి వ్యాసంలోకి బొమ్మ చేర్చవచ్చు. పైప్ చిహ్నం (|) ఉపయోగించి బొమ్మ ప్రదర్శితమయ్యే తీరుని ప్రభావితం చేయవచ్చు. సామాన్యంగా thumb అని వాడితే బొమ్మ చిన్నరూపంగా, ఒక శీర్షికతో ప్రదర్శిత మవుతుంది. [[File:Example.jpg|thumb|శీర్షిక]]

బొద్దు పాఠ్యం

ఒక పద బంధానికి ముందు, తరువాత మూడు ఒక గుర్తు కొటేషన్ మార్కులను కలిగి ఉంటే ఇది కనబడే తీరుని బొద్దు పాఠ్యం అంటారు. వ్యాస ప్రారంభంలో వ్యాస విషయానికి సాధారణంగా బొద్దు పాఠ్యం వాడుతారు. '''బొద్దు పాఠ్యం'''

మూలం వివరణ (Citation)

<ref></ref> టాగ్ ల మధ్య మూలం వివరం చేరుస్తారు. అప్రమేయంగా వరుససంఖ్య తో ఇది పై సూచికలాగా కనబడుతుంది. మూలాల విభాగంలో వివరం కనబడుతుంది. <ref> మూలం వివరణ</ref>

అంతర్వికీ లింకులు

ఒక పదబంధం ముందు, తరువాత రెండు స్క్వేర్ బ్రాకెట్లు ఉంచితే ఆ పేరుతో గల వ్యాసానికి లింకు ఏర్పడుతుంది. మూసే స్క్వేర్ బ్రాకెట్ ముందు పైప్, దాని తరువాత పదబంధం చేరిస్తే ఆ పదబంధం లింక్ కనబడే పాఠ్యంగా మారుతుంది. [[ వ్యాసం పేరు| లింకుగా కనబడే పాఠ్యం]]

వాలు పాఠ్యం

ఒక పద బంధానికి ముందు, తరువాత రెండు ఒక గుర్తు కొటేషన్ మార్కులను కలిగి ఉంటే ఇది కనబడే తీరుని వాలు పాఠ్యం అంటారు. కొన్ని ప్రత్యేక పదాలను చూపించడానికి వాలుపాఠ్యం వాడతారు ''వాలు పాఠ్యం''

శీర్షిక

రెండు సమానం చిహ్నాల మద్య ఉన్న పదబంధం శీర్షికగా ఉంటుంది. మూడు సమానం చిహ్నాల మద్య ఉన్న పదబంధం ఉప శీర్షికగా ఉంటుంది.
== శీర్షిక==


మూస

మూసలను వాడుటకు రెండు బ్రేసులను మూస పేరుకి ముందు, తరువాత వాడతారు. మరల మరల వాడే భాగాలకు, విస్తృత ప్రయోజనలకు మూసలు ఉపయోగం. మూసపేరు తరువాత పైప్ తో వేరు చేస్తూ పరామితులను ప్రవేశపెట్టవచ్చు. వీటిని వాడితే మూస పనిచేసే విధానం లేక ప్రదర్శించే సమాచారం మారుతుంది. {{ మూస పేరు|పరామితి}}

మూలాలు

మూలాల జాబితా టాగ్ లేదా సమానమైన మూస పై సూచికలు కనబడే స్ధానాన్ని నిర్ణయిస్తుంది. ఇది సాధారణంగా వ్యాసం చివరిలో గమనికలు లేక మూలాల విభాగంలో వుంటుంది. <మూలాలజాబితా/>

వెలుపలి లింకులు

తెరిచే ఒక స్క్వేర్ బ్రాకెట్, యు.ఆర్.ఎల్‌(URL) , ఖాళీ అక్షరము, కనబడవలసిన పాఠ్యం, మూసే ఒక స్క్వేర్ బ్రాకెట్ తో సాధారణ హైపర్ లింకు తయారవుతుంది. సాధారణంగా దీనిని వ్యాస ముఖ్య భాగాలలో వాడరు. మూలాలలో గాని బయటి లింకులు విభాగంలో వాడతారు. [http://www.example.com కనబడవలసిన పాఠ్యం]

వర్గాలు

వ్యాసానికి చివరగా వర్గం: తో ప్రారంభమయ్యే పదబంధం చుట్టూ రెండు స్క్వేర్ బ్రాకెట్లను చేర్చితే వ్యాసం ఆ వర్గంలోకి చేరుతుంది. ఒక విషయానికి సంబంధించిన వ్యాసాలను సమితులుగా నిర్వహించడానికి ఇవి ఉపకరిస్తాయి. [[వర్గం:వర్గం పేరు]]

మరింత మార్కప్ సహాయానికి, వికీ మార్కప్ పేజీ 15 లో చూడండి లేక వనరుల పేజీ చూడండి| దగ్గరిదారి WP:MARKUP