పుట:Contributing to Wikipedia brochure draft version 7.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సవరణకు సిద్ధమవడం

వికీపీడియా వీలైనంతగా విశ్వసించదగినదిగా చేయటానికి, ఉపయోగకరంగా వుండడానికి చాలా కాలంనుండి జరిగిన చర్చల ఆధారంగా ఈ విధానాలు, మూల సూత్రాలను అభివృద్ధి చేశాము.


వికీపీడియాలో ఎవరైనా దిద్దుబాట్లు చేయవచ్చు. అయినప్పటికీ అందుకు ప్రాథమిక నిబంధనలు ఉన్నాయి. మీరు దిద్దుబాట్లు ప్రారంభించే ముందు అతిముఖ్యమైన అంశాలలో కొన్నిటిని గమనించండి:

నిష్పక్షపాత ధోరణి

వికీపీడియాలో వ్రాసేవన్నీ నిష్పక్షపాత దృష్టితో వ్రాయాలి. ఏ పక్షం ప్రధానంగా భావించక, పక్షపాతం లేకుండా, ఖచ్చితమైన విశ్వసనీయమైన మూలాల ఆధారంగా విషయంపై అన్ని దృక్కోణాలు వివరించాలి. పిడి వాదనలు లేక ఒక దృక్కోణాన్ని సమర్థించేలా వ్రాయడం వికీపీడియా వ్యాసాల్లో చేయకూడదు.

మూల పరిశోధనలకు స్థానంలేదు

తేలికగా చెప్పాలంటే, వికీపీడియా మూల ఆలోచనలు చేర్చుటకు తగిన స్థలం కాదు. ఇతరుల విషయాన్ని గురించి విశ్వసనీయమైన మూలాలలో పేర్కొన్న వాటిని సంగ్రహం రూపంగా వికీపీడియాలో వ్రాయాలి. వ్యాసాలలో కొత్తగా విశ్లేషణలు చేర్చకూడదు. ఇప్పటికే ముద్రించిన వివరాలను కలపటం, విశ్లేషణం ఆధారంగా మూల వనరులు చెప్పేసారాంశం కంటే విస్తరిత సారాంశానికి చేరువయ్యేటట్లు రాయకూడదు.

కాపీ హక్కులు, గ్రంథచౌర్యము

సభ్యులు చేర్చిన అన్నీ ఉచిత లైసెన్స్ తో విడుదలవుతాయి కాబట్టి ఎవరికి, ఏ వ్యాసానికి యజమాన్య హక్కులు లేవు. మీ కృషి అంతా నిరంతరం దిద్దుబాట్లకు గురి అవటం, మరల పంపిణి జరుగుతుంది. కాపీహక్కులు గల వనరుల నుండి కొన్ని క్లుప్త వ్యాఖ్యలు మాత్రమే వికీపీడియాలో చేర్చవచ్చు. నేరుగా కాపీ చేయడం కానీ, చాలా పోలికలున్న రీతిలోచేర్చటం, గ్రంథ చౌర్యము, కాపీ హక్కుల వుల్లంఘనకు దారితీస్తుంది. ఇది వికీపీడియా కృషికి మచ్చతెస్తాయి. వీటిన సవరించడానికి స్వచ్ఛంద సభ్యులకు చాలా సమయం పట్టేటట్లు చేస్తాయి. వికీపీడియాలో చేర్చవలసిన సమాచారం మీ స్వంత పదాలలో వ్రాయాలి. (ప్రజోపయోగపరిధి మరియు స్వేచ్ఛగా లైసెన్స్ గల విషయాలు వికీపీడియాలో సరియైన మూలాలను పేర్కొంటూ వాడవచ్చు)


విశ్వసనీయమైన వనరులు

వికీపీడియాలో గల సమాచారం విశ్వసనీయమైన, ముద్రితమైన వనరులనుండి ధృవీకరించుటకు తగినదై వుండాలి. మీరు వాడే వనరుల సమాచారాన్ని వ్యాసంలో పేర్కొనాలి. అప్పుడే ఇతరులు వాటిని తనిఖీ చేసుకోగలుగుతారు. నిజనిర్ధారణకు పేరు ప్రతిష్టలు కలిగిన మూడవ పక్షం వనరులు అనగా విద్యావిషయాల ముద్రణలు, సహపరిశోధకులచే సమీక్షింపబడిన విద్యావిషయక పత్రికలు, జాతీయ, అంతర్జాతీయ పత్రికల ను మాత్రమే వాడాలి. ప్రాధాన్యమున్న దృక్కోణాలన్నిటిని ప్రచురించే వనరులను వాడితే మంచిది. అరుదుగా ప్రచురించే లేక సమాజపు అంచులలో వుండే సముదాయాల వనరులను వాడవద్దు. విషయం గురించి, ఉన్నత నాణ్యతగల, విశ్వసనీయమైన వనరుల కోసం అన్వేషించండి.

వైరుధ్యాసక్తులు

మీరు పనిచేయుచున్న సంస్థ లేక మీకు ఉపాధి కల్పించినవారి గురించిన విషయాలపై మీకు వైరుధ్యాసక్తులున్నప్పుడు, వాటి గురించి వ్యాసాలను వ్రాయవద్దు.