పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

49

గావించుటకును నాకు శక్తినిప్రసాదించుటకు దేవుని ప్రార్థించెదను. దేశాంతరములలో స్వేచ్చకు పోరాడినవారు యువకులేగాని వృద్ధులుగారు. నిర్మలహృదయులై , స్వార్థత్యాగపరాయణులైన యువకులే ఈకార్యమునకు పోరాడవలసినవారు. యుద్ధమాసన్నమైనది. నేనా ముసలివాఁడ నగుచున్నాను. మనోదార్ఢ్యము తప్పుచున్నది. నన్ను ఇంకను నిర్బంధించ లేదు. అయితే నాచేతులకు సంకెళ్ళుతగిలించి నన్ను నిర్బంధించినట్లు నాకు గోచరించుచున్నది. ఈవేదన దాస్యసంబంధమైనది. భారతమంతయు చెఱసాలయైయుండ నన్ను నిర్బంధించియుంచిన నేమి, విడుదలగ నుంచిననేమి ? నేను బ్రతికియున్నను చచ్చినను దేశీయమహాసభోద్యమము అవిచ్ఛిన్నముగ జరుగవలయును."

నిర్బంధము.

చిత్తరంజనుని ఈయుపన్యాసముచే కలకత్తాలోని కళాశాలల విద్యార్థులేమి హైస్కూళ్ల విద్యార్థులేమి వేనకు వేలు నేల యీనినదన్నట్లు ఐచ్ఛికభటులుగఁ జేరిరి. కలకత్తా పురమంతయు ఐచ్ఛికభటమయమైనది. ప్రభుత్వపు అధికారులు కలవరపోయిరి. కలకత్తా గవర్నరు రోనాల్డుషే ప్రభువు తహతహపడెను. ఇక నాలస్యము