పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

చేయరాదనుకొనెను. వెంటనే గూఢచారులగు పోలీసులకు తన ఉద్దేశమును దెలిపెను. వారు చిత్తరంజనుని వెన్నంట మొదలిడిరి. దాసు ప్రభుత్వముతో మల్లచరచుచున్నాఁడని గవర్నరుకు దెలిపిరి. గవర్నరు కుపితుఁడయ్యెను. దాసును నిర్బంధింప నాజ్ఞ నొసంగెను. పరమభాగవతుని దేశసేవాపరాయణుని, ప్రజోపకారిని, ఆత్మత్యాగిని, సర్వత్యాగిని, 1922 సం. డిసంబరు 10 వ తేదినాఁడు నిర్బంధించిరి పోలీసులు. 6 నెలలు విడిశిక్షను విధించిరి. మాజిస్ట్రీటుతన్ను పట్టుకొనగానే భారతీయులకు దాసు ఈక్రింది సందేశమును పంపెను.

ప్రజలకు సందేశము.

“ఓ భారతపుత్రులారా! ఇది నాకడపటి సందేశము. విజయము దృష్టిగోచరమగుచున్నది. కష్టము నోర్చుటవలన దానినిమీరు పొందగోరుదు రేని అది మీకు సిద్ధించును. వారు మాతృభూమిపక్షమున నిలువరేని నిరంకుశాధికారులపక్షముననే నిలుచువా రగుదురు.

విద్యార్థులారా! భరతఖండమునకు మీరు మూలాధారులై యున్నారు. భారతముయొక్క ఆశయము కీర్తి మీపై నాధారపడియున్నది. రెండున్ను కూడిన నాల్గగునని తెలిసికొనుటయే నిజమగు విద్య