పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

వర్గము కోరువారికన్న ఎక్కువమంది జెయిళ్ళకుపోవుటకు సంసిద్ధులై యున్నారు. కలకత్తాసంగతి యేమి యని నాకు చింతగానున్నది. కలకత్తాలో నిన్ని కళాశాలలున్నవి. ఇన్ని పాఠశాలలుండు ఈపట్టణమున 5 వేలమంది వాలంటీర్లు మాత్రమేనా ? వీరిలో నార్గుఱుమాత్రమే బంధింపఁబడిరి వీరు వడుకు నూలుబట్టల నమ్ముచు రాటములను గృహములకు పంచి పెట్టు నేరము మోపఁబడిరి. ఈకారణమున నే వీరి కీనిర్బంధము. అందువలన దొరతనమువారు అసహాయోద్యమము నణచివైచుటకు కంకణము కట్టికొనిరని తేలినది. ఇంతగొప్ప కలకత్తాపట్టణములో 5 వేలమందేనా ఐచ్ఛికభటులు? దేశీయ మహాసభోద్యమము ఆపుదల కానున్నదట ! ఓకలకత్తావిద్యార్థులారా ! మీరేమిచేసెదరు ? ఇప్పుడేనా చదువుకు సమయము? కళలు, సాహిత్యము, గణితము, శాస్త్రము వీనిని సాధించుట కిదేనాసమయము ? దేశమాతపిలుపునకు మీహృదయములు గఱగవా? ఈగొప్పపట్టణము నాకు నిర్జనమైన ఎడారిగానున్నది. నాచుట్టు సదా యువకులున్నారు గాని వారికి ముఖవికాసములు లేవు. నిరుత్సాహులు, జీవచ్ఛవములుగ గాన్పించుచున్నారు. వారికి ఆత్మబలమునొసంగుటకును వారిని ఉత్సాహయుతులను