పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

47

న్యాసముల నొసంగెను. విద్యార్థులు విధేయులైరి. చిత్తరంజనుఁడు తనమహోపన్యాసములలో నొక్క దానియం దిట్లు చెప్పియున్నాఁడు.

విద్యార్థులు, ఐచ్ఛికభటులు.

“లజపతిరాయిని అధికారులు బంధించి కాంగ్రెసును బంధించిరి. లజపతిరాయిగారు. కాంగ్రెసుకు పట్టుకొమ్మ. దీనివలన దేశీయమహాసభ యే దెబ్బ తినినది. అధికారవర్గముయొక్క ఈబాహాటమైన చర్యవలన బలాబలములను చక్కగ జూపుటకు అవకాశమేర్పడినది. కాంగ్రెసువా రేర్పఱచిన (స్వరాజ్యప్రాప్తికి) నియమితకాలము సమీపించినందున ఫలితము ప్రకటింపఁబడుటకు సమయమైనది. బంగాళా దేశములోని నిర్బంధములు ఇతరరాష్ట్రపు నిర్బంధములకు తీసిపోవు హింధూమహమ్మదీయ సఖ్యత ఐకమత్యము ప్రపంచమునకు చాటుచిహ్న మోయన పీర్ బాద్షామియాన్ గారిని, డాక్టర్ సురేష్ గారిని కలిపి సంకెలలు తగిలించి జెయిళ్ళకు గొంపోయిరి. ఇట్లే చిటగాంగున జితేంద్రమోహనసేన్ గుప్తగారు, ఉపాధ్యాయ నృపేంద్రుఁడు వెయ్యి మంది. ఐచ్ఛికభటులతో మహామహోపధ్యాయ జిరేంద్రనాథముఖర్జీ గారు, వీరందఱు జెయిళ్ళకంపఁ బడిరి. కోమిల్లాజిల్లా బ్రహ్మంచేరియాలో అధికార