పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

నిర్దోషులని తలంపుగొనునట్లుచేసి వారిని విడుదల గావించెను. ఇట్టివి లెక్కించినచో వానికి అంతము లేదు. 1918 వ సం॥ ఇండియామంత్రి మాంటాగూ గారు సంస్కరణలవిషయమై దేశములోని సంఘముల యాలోచనలను గైకొనుటకు ఇండియాకు రాగా దేశీయమహాసభతరఫున చిత్తరంజనుడును మఱికొందఱుగూడి యొకగొప్ప మెమోరాండమును సిద్ధపఱచి భారతమంత్రి యెదుట నుంచిరి. అంతేగాక 1918 వ సంవత్సరమున మహామంత్రిగారితో దేశక్షేమముల విషయమై ముచ్చటించవలసిన సంగతులను ఆలోచించుట కొఱకు ఆగష్టునెలలో దేశీయమహాసభకు సంబంధించిన భారతదేశీయప్రముఖులు బొంబయిలో సభఁ జేసిరి. ఆసభకు జనాబ్'; హాసాన్ ఇమాంగారు అధ్యక్షులు. ఆసభకు చిత్తరంజనుఁడు వంగ దేశమునుండి నూర్గురు ప్రతినిధులను తన స్వంతఖర్చు పెట్టి పిలుచుకొనిపోయెను. సభ ముగియగానే లోకమాన్య తిలకుగారు చిత్తరంజనులను, చక్రవర్తి మున్నగు వంగీయప్రతినిధులను మఱి ఇతరరాష్ట్రపు ప్రతినిధులగు కొందఱను పునహాకు విచ్చేయమని కోరగా వల్లెయని పునహాకువెళ్ళిరి. అప్పట్లో చిత్తరంజనునియొక్క సహజౌదార్యము, కార్యదీక్ష, ఆలోచనాశక్తి, దేశసేవాపరాయణత్వ