పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

41

మునకు లోకమాన్యులద్భుతపడిరి. ఇరువురకును మైత్రికుదిరెను. పునహాకు నీమహనీయులు విచ్చేయగా లోకమాన్యులొక సభఁజేసి వీరి నభినందించి దేశాభ్యుదయమునకు గాను ఈమహామహులు బూనియుండు తదేకదీక్షను కొనియాడుట కొక సభగావించెను. ఆసభకు బాబుమోతీలాల్ ఘోసు (అమృతబజార్ పత్రికాధిపతి) గా రగ్రాసనాధిపత్యమును వహించిరి. ఈ సభాసమా వేశా నంతరము చిత్తరంజనునికి లోకమాన్యుల యెడ అపరిమితమగు భక్తిజనించి ఆభక్తి లోకమాన్యుల మరణ పర్యంతమును ఇప్పటికిని తరుగనిదై ప్రకాశించుచున్నది. 1918వ సంవత్సరము దేశీయమహాసభ ఢిల్లీలోగూడెను. ఈసభకు మదనమోహనమాళవ్యాగా రగ్రాసనాధిపతులు. వారితోగూడ చిత్తరంజనులును దేశీయమహాసభకువిచ్చేసిరి -ఈసభ యొక్క విషయనిర్ధారక సంఘసమా వేశమునందు ఆనిబెసాంటమ్మ అయిదవజార్జి చక్రవర్తికొమారుఁడు మనయువరాజు భారతదేశ సందర్శనార్థమై రాఁబోవుచున్నాఁడు; ఆసమయమున దేశీయమహా జనుల తరఫున వారికి సన్మానపత్ర మొకటి అర్పింపవలయునని యొకతీర్మానమును తెచ్చుటకు యత్నింపగా చిత్తరంజనుఁడు దాని కాటంకముగా ఉపన్యసించి