పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

39

మునకై చలించి చిత్తరంజనునకు జూపిన తమవిధేయత వేనోళ్లపొగడఁదగినది. 1917 వ సంవత్సరమున కలకత్తాలోజరిగిన దేశీయమహాసభకు చిత్తరంజనుడు చేసినయుపకృతి అపారమైనది. బంగాళమునందు 1916 వ సంవత్సరమున స్వరాజ్యకలహములో చిత్తరంజనదాసు, శ్రీ చక్రవర్తి, విపినచంద్రపాలు — వీరు అగ్రగణ్యులు. 1917-వ సం. అనిబిసెంటమ్మను నిర్బంధమునుండి విడుదల చేయుటకుగాను కలకత్తాలో రాజకీయవిషయైకమగు సందర్భములలో తాను వ్యవహరించుటకు ప్రారంభించినది మొదలు చిత్తరంజనుఁడు ఈనాఁడువఱకు వెనుకడుగిడక తదేకదీక్షతో ఇండియా ప్రభుత్వముయొక్క నిరంకుశాధికారవర్గముతో నిర్భయముగా ఱొమ్మునుజూపి పోరుచునే యున్నాఁడు. 1909-వ సంవత్సరమునుండి నిరంకుశాధికారవర్గముయొక్క అధికారుల బారిబడి యనేకులు నేరస్థులై విచారణలకు వచ్చినప్పుడు వారికి సాయపడి వారితరఫున తాను వాదించి వారిని విడుదలజేయించి మహోపకార మొనరింపసాగెను. కలకత్తాలో ట్రంకు కూనీ కేసని యొకదానిలో పోలీసులచేత నిరువురు నిరపరాధులు దోషులై రి. నిష్కారణముగ నిందితులైన వీరివిషయమై చిత్తరంజనుఁడు జాలిగొని వారి తరఫున తాను వాదించి న్యాయాధిపతులకు వారు