పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

31

క్షీణించినవని తలచుకొనుఁడు. పల్లెటూళ్లు ప్రజాక్షిణతను చెందినందులకు కారణములు రెండు. ప్రథమమున పల్లెటూళ్లలో ఆరోగ్యముచెడి జ్వరబాధ ఎక్కువయ్యెను. రెండవది నగరవాసవాంఛతో భోగాఫేక్ష, వ్యాపారవాంఛతో ద్రవ్యమును సేకరించుటకు జను లత్యాతురపడెదరు. కావున ప్రస్తుతపు మహాపట్టణములు ఘోర అజగరములవలె చిన్న చిన్న ప్రాకుడుజంతువులగు పల్లెటూళ్లను నశింపఁ జేయుచున్నవి. కావున మన కర్తవ్యధర్మములలో పల్లెటూళ్లయొక్క ఆరోగ్యమును, అభివృద్ధిని, క్షేమమును కాపాడుటకు యత్నించుటయే ప్రథమ గణ్యము. పల్లెటూరివానికి వలయు నీటిపారుదల, ఆరోగ్యపద్ధతి, విద్య వీని నన్నింటిని యేర్పాటు చేయుటకు మనము యత్నింపవలయును. వ్యవసాయ దారుఁడు పూర్వము ఆఱు నెలలు పొలములో పనిచేసి పని లేనికాలమున రాట్నమువద్ద కూర్చుండి వలయు నూలు వడికి నేతగానికి తానుధరించువస్త్రములకు గావలయు నూలు నందిచ్చుచుండును. కట్టుబట్ట తినుటకుతిండి సునాయాసముగా కర్షకుఁడు సంపాదించుకొనును.అట్టివ్యవసాయదారుఁడు ఈదినములలోమృగ్యమయ్యెను. వానితో గుప్తజీవనము సైతముపల్లెటూరును వదలిపోయినది. ధాన్యపుపాతరలు