పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

కారమునుండియు, జాత్యాధిక్యమను డాంబికచర్య నుండియు మనము తొలఁగుటకు యత్నింపవలయును. పరమేశ్వరుని దివ్యమంగళ విగ్రహము మన బీదజనులలో తాండవమాడు చున్నదని గ్రహింపుఁడు. వారిని అనాగరకులని భావింపకుఁడు. వారు ఆపదలో నుండువానికి సాయమొనర్చెదరు. క్షుత్పిపాసాపీడితునకు అన్నోదకముల నొసగెదరు. వారు ఆపదలను గుర్తింతురు. ఆతిథ్య మొసంగుదురు. స్వార్థ త్యాగమును వలసినప్పుడు చేయుదురు. వరా యనాగరకులు? వారినేలమనము నిరసించవలయును? దీనస్థితియందుండువారని వారిని మీరెన్నుదురు. కోటానకోట్లుగ ఇట్టి స్వరూపములు భారతదేశములో నున్నవి. వారు హిందువులైనను సరేమహమ్మదీయులైనను సరే చండాలురైనను సరే క్రైస్తవులైనను సరే పార్సీజాతులైనను సరే అందఱను నారాయణస్వరూపములనియు వంగీయులంద ఱెన్నవలయును. వారితో మీసోదరులతో కలసిమెలసి యుండున ట్లుండుడు. అప్పటికిగాని మీదేశోద్ధారకపు కృషి ఫలించినదని తలపకుఁడు.

పల్లెటూరియందే మన జాతీయ నాగరకము కేంద్రీభూతమైయున్నదని తలంపుఁడు. దానిని అనాదరణచేసినచో మనయావద్వ్యవహారములును తప్పక