పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

గాని, కూట్లుగాని, పల్లెటూళ్లలో పూర్వము ఏండ్లకొలది బంగారువాసననీనుఛుండునది కన్నులకు కలిక మయ్యెను. పంటలు తరిగెను; పాడియస లే లేదు. పచ్చని బయళ్లతో విరాజిల్లుచుండిన భూభాగములు ఎడారివలెగాన్పించుచున్నవి. గ్రామదేవత లారాధింపఁ బడవు. ఇలు వేల్పులను తలచువారే లేరు. దుక్కి టెద్దుల నమ్మి శిస్తుకట్టవలసిన కాలము తటస్థించినది. బీదరైతునకు ఊరి కాధారమైన చెఱువునందు నీళ్లులేవు. గుంటలు, బావులు నిర్జలములై నవి. వాడెట్లు జీవింపగలఁడు! వానికి ఆధారములను జేయుటకు ఊరియందు మనుష్యులు లేరు. ఉన్న వాఁ డశక్తుఁడు. ఇంక పల్లెటూళ్లు నశింపక వృద్ధియగు టెట్లు? ఊరుక్షీణించగనే జూతీయవిధులకు ఆకరములన్నియు నశించుచున్నవి. వ్యవసాయము క్షీణించెను; పరిశ్రమలన్నియు నశించినవి. రాట్నము, నేతమగ్గము, కమ్మరి యావము మొదలగు చేతిపనులకు సాధనములన్నియు నశించినవి. పల్లెటూరివాఁడు తనకు కట్టుబట్టకు మాంచెస్టరు యంత్రముల నాశ్రయించుచున్నాడు ,లాంకాషైరు వర్తకులదయకు పాత్రీభూతుఁడయ్యెను. వంట పాత్రములకు చీనావారి దయకును, ఆస్ట్రియావారి దయకును పాల్పడెను. ప్రమిదలా దీపముంచుకొనుటకు మాయములైనవి, గ్లాసులుబయలు దేరినవి, పల్లె