పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

29

నకు మనము సేతువు నిర్మింపవలయును. అట్లు సేతువు నిర్మించినగాని మనజాతీయపరిస్థితులు పునరుద్ధరింపఁబడవు; అని నుడువుచు ఆంగ్లేయులు భారతదేశమున కేర్పాటుగావించిన నూతనవిద్యాపద్ధతులలోని లోపముల నన్నింటిని వెలిబుచ్చెను. కావున బాలురకు విద్యావిధానమునంతయు దేశభాషలోనే గావింపవలయుననియు పరభాషయగు ఇంగ్లీషునందే నేర్పరాదని సిద్ధాంతముచేసెను. ఇంగ్లీషుభాషచే నేర్పడుదొసగు లింతింతనరాదనియు, పల్లెటూరిజనులకును మనకును ఈభాష సామీప్యమును చెందించదనియు, నట్లు చేయుటచే జాతీయభావములకు మనము వెలియై పోవుచున్నామనియు నుడివెను. మన జాతీయత యనగా నేదియో యది ఇప్పటికిని మన జీవనార్థము కష్టపడు వ్యవసాయదారుని గృహమునందు తాండవమాడుచున్నది. ఆవృత్తివానిని మనము నిరసించెదము. వానిని మన ఆంగ్లేయవిద్యగాని ఆంగ్లుల నాగరికముగాని ఆంగ్లన్యాయస్థానములు గాని చెరుపనేరదు. మనజమిందార్లుగాని ధనవంతులుగాని ప్రస్తుతపు మన ప్రభుత్వమువారుగాని క్షీణింపజేయలేని వ్యవసాయవృత్తిదారుని కంటె ఆగ్లేంయవిద్యనుచదివినామని విఱ్ఱవీగుఅల్పసంఖ్యాకులలో జేరిన మనమా అధికులము? ఇట్టి బూటకపు అహం