పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28


బంగాళారాష్ట్రపు అధ్యక్షకోపన్యాసము.

1917 వ సంవత్సరమునబంగాళారాష్ట్రపు కాంగ్రెసుశాఖయొక్క వార్షిక సమావేశమునకు చిత్తరంజనుని అధ్యక్షునిగా నెన్నికొన్నప్పుడు తన అధ్యక్షకోపన్యాసమునందు భారతదేశమున సంఘసేవయు, దేశసేవయు రెండును ఒక్కటియే యని స్థిరముగా నిరూపించెను.

దేశస్థితినిగాని దేశపు దీనజనులనుగాని ప్రస్తుతము వంగీయులు గమనించరు. అందుకు కారణము వారు నేర్చుకొను విద్యయు, దాని పద్ధతియునే యని యాయుపన్యాసమునందు స్పష్టీకరించెను. నూతనవిద్య, నూతనవిద్యాపద్ధతులు, నూతన నాగరీకమున కలవాట్లు, ఇవంతయు జాతీయపద్ధతులను మార్చినదే గాక జాతీయవిధానమునంతయును నశింపఁ జేసినదనియు, బంకించంద్రుఁడు నుడివిన సంగతులను పలుమారు తనదేశస్థులు గమనించుచుండ వలయుననియు, విద్యావిధానమునంతయు ప్రస్తుతము మార్పొనర్చిన గాని మనజాతి కే నిలువనీడయుండక తప్పకజాతిసైతము క్షీణించుననియు నుడివెను. ప్రస్తుత నూతన విద్యాపద్ధతియంతయు విద్యాధికుల మనుకొను మనకును మనవారగు పామరజనులకును మధ్య పెద్ద అఖాతము నేర్పఱచెను. ఈయఖాతము