Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60 చిన్ననాటి ముచ్చట్లు

కలిగిన కొత్తసమస్య కాదు. ఇది మద్రాసు పుట్టిననాట నుండియు ఉన్నదే. 1718లోనే 'కోటకు మైలులోపల త్రాగుటకు నీరు దొరకదు' - అని యొక పాశ్చాత్యుడు వ్రాసియున్నాడు. ఆ రోజులలో పెద్దినాయుని పేట ఉత్తరభాగముననున్న బావులనీటిని ఎద్దులపై సిద్దెలతో తెచ్చి అమ్మేవారు. 2 దుడ్డులకు ఒక్కబిందెడు నీళ్లు అమ్మేవారు. దుడ్డు అనగా 5 రాగికాసులు లేక 2పైసలు. సెయింట్ థామస్ మౌంట్లో దొరుకు నీరువలె చల్లగాను, హితువుగాను ఉండేవని ఆ రోజులలో వాటికి ప్రతీతి.

1770 ప్రాంతంలో నీటి ఎద్దడివల్ల ఊరిలో కలరా జాడ్యము చెలరేగినది. 1772లో పెద్దినాయకుని పేటలో ఉండే 7 బావులనుండి రెండుమైళ్ల దూరముననున్న కోటకు (సముద్రమున కొక్క మైలు దూరము) మంచినీరు సప్లయిచేసే స్కీము నేర్పాటు చేసిరి.

నిజమునకివి 10 బావులు. ఈ బావులన్నియు 16 అ||ల మధ్య కొలత గలవి. 23 మొు 29 అడుగులలోతు. పికోటాలతో నీరుపైకి తెచ్చి ఎత్తునగట్టిన తొట్టలో నిలువచేసి, యంత్ర సాధనమున వడియగట్టుట కేర్పాటు. అట్టు వడియగట్టిన నీటిని పెద్ద గొట్టములద్వారా కోటలోను వెలుపలను ఉన్న మిలిటరీవారికి నీటి సప్లయి చేయుచుండిరి. ఈ బావులలో నీరు ఎప్పడూ సమృద్దే. మరి ఒక్క శతాబ్దమునకుగాని ఎర్రకొండలచెరువు (Red Hills Tank) ఏర్పాటు జరుగలేదు. ఆ శతాబ్ద కాలములో నిరంతరం ఈ బావులు నీటిని సప్లయి చేసినా నీరు తరుగలేదు. 1885లో గాలివానవచ్చి ఎర్ర కొండల చెరువు వద్ద యంత్రములు చెడిపోయినప్పుడు 10 రోజులు నగరమున చాలామందికి ఈ నీరు సప్లయి అయినది.

1783-87 సం||ల మధ్య ఈ ఏడుబావుల నీటినే కొళాయిలద్వారా కోటలోను వెలుపలను మిలిటరీకానివారి ఇండ్లకును సప్లయిచేసిరికాని దీనిని